Acharya Nagarjuna University: ఏఎన్ యూతో బ్రిటీష్ కౌన్సిల్ ఎంవోయూ
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీతో భారత్లోని బ్రిటీష్ కౌన్సిల్ ఎంవోయూ(అవగాహనా ఒప్పందం) కుదుర్చుకుంది.
యూనివర్సిటీలో డిసెంబర్ 13న జరిగిన కార్యక్రమంలో వీసీ ఆచార్య పి.రాజశేఖర్ సమక్షంలో ఏఎన్ యూ రిజిస్ట్రార్ డాక్టర్ బి.కరుణ, బ్రిటీష్ కౌన్సిల్ ప్రతినిధి గౌతమ్దాస్ అవగాహన ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. కామన్ సర్వీసెస్ స్కీమ్(సీఎస్సీ)లో భాగంగా బ్రిటీష్ కౌన్సిల్ ఆరు నెలల పాటు ఏఎన్ యూ ఫార్మసీ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఆంగ్లభాష నైపుణ్య శిక్షణ ఇస్తారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆచార్య ఎ.ప్రమీలారాణి, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.
చదవండి:
Dr Kakumanu Raja Sikhamani: రెస్ట్ తీసుకునే వయసులో ఎవరెస్ట్‌పై
Published date : 14 Dec 2021 12:52PM