Minority Gurukulam: ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ఐదోతరగతి, ఆరు నుంచి పదో తరగతి వరకున్న బ్యాక్‌లాగ్ ఖాళీలు, జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ(సీఓఈ)లో మొదటి సంవత్సరం అడ్మిషన్లకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఏప్రిల్ 11వ తేదీలోగా సొసైటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కార్యదర్శి షఫీయుల్లా తెలిపారు. దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసేందుకు సొసైటీ ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందించింది. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఐదోతరగతి ప్రవేశాలకు సంబంధించిన అర్హత పరీక్ష మే 9వ తేదీన నిర్వహించనున్నారు. అదేవిధంగా 6,7,8 తరగతుల్లో బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి సంబంధించి మే10వ తేదీన నిర్వహిస్తారు. ఫలితాలు 23న విడుదల చేస్తారు. ఇంటరీ్మడియట్ ఫస్టియర్ ప్రవేశాలకు సంబంధించి అర్హత పరీక్ష మే 21వ తేదీన నిర్వహిస్తారు. ఫలితాలు జూన్ 6న వెల్లడిస్తారు.
చదవండి:
JEE Main 2022: పరీక్ష షెడ్యూల్ విడుదల.. ఇలా ప్రిపేర్ అయితే విజయం మీదే..