Navodaya Entrance Test: 10న నవోదయ ప్రవేశపరీక్ష
9 తరగతిలో ప్రవేశానికి 956 మంది, 11వ తరగతిలో 434 మంది విద్యార్ధులు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. 9వ తరగతికి రాజంపేట పట్టణంలో 4 పరీక్షకేంద్రాలు, 11 తరగతికి నవోదయ విద్యాలయంలో పరీక్ష కేంద్రం ఏర్పాటుచేశామన్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరూ నవోదయ వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్ల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. ఇందులో ఏదైనా సమస్య ఉంటే 94947 67721, 80963 29332, 83099 70824 నంబర్లలో సంప్రదించాలన్నారు.
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటకు చెందిన కూచిపూడి నృత్య కళాకారిణి వాత్సల్య లక్ష్మి పేరు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో నమోదైంది. గతనెల 28న హైదరాబాద్‌లోని అష్టలక్ష్మి ఆలయంలో 365 మంది విద్యార్థినులతో వాత్సల్య లక్ష్మి ఏకకాలంలో శివ పంచాక్షరి కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనను వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదుచేసి ధృవీకరణ పత్రాన్ని ఆందించారు. అలాగే పలు సంస్థల వారు అవార్డులతో సత్కరించారు.
చదవండి: Entrance Test: 5వ తరగతి ప్రవేశాలు.. పరీక్ష తేదీ ఇదే..
26 నుంచి సెమిస్టర్ పరీక్షలు
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ, ఎంఈడీ కళాశాలల విద్యార్థులకు ఈనెల 26 నుంచి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి తెలిపారు. బీఈడీ, ఎంఈడీ మూడో సెమిస్టర్ (రెగ్యులర్, సప్లిమెంటరీ), మొదటి సెమిస్టర్ (సప్లిమెంటరీ) విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాలన్నారు. ఈనెల 26, 27, 28, 29 తేదీలలో, మార్చినెల 1వ తేదీన పరీక్షలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు హాల్‌టికెట్‌లు, టైంటేబుల్ కళాశాలల నుంచి పొందాలని సూచించారు.
పీజీ పరీక్షలు ప్రారంభం
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం పోసు్ట్రగాడ్యుయేషన్ సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంపీఈడీ ప్రథమ సెమిస్టర్ పరీక్షలు విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌బ్లాక్, సైన్స్‌బ్లాక్‌లో నిర్వహించారు. ఈ పరీక్షలను వైస్ చాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం విద్యార్థుల హాల్‌టికెట్‌లను పరిశీలించారు. ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Admissions in Model Schools: 6 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
వైవీయూ క్రీడాకారిణికి రజతం
వైవీయూ: హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మస్థల్‌లో గురువారం జరిగిన ఆలిండియా అంతర్ విశ్వవిద్యాలయాల వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో యోగివేమన విశ్వవిద్యాలయానికి రజత పతకం లభించింది. వైవీయూ క్రీడాకారిణి లీజా కంసా 59 కేజీల విభాగంలో పాల్గొని రెండోస్థానంలో నిలిచి రజతం కై వసం చేసుకుంది. వైస్ చాన్సలర్ చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకటసుబ్బయ్య, ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి క్రీడాకారిణికి అభినందనలు తెలిపారు.