Admissions in Model Schools: 6 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
మెదక్ కలెక్టరేట్: ఆదర్శ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినట్లు డీఈఓ రాధాకిషన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైందని.. ఈనెల 22వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. అడ్మిషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు రూ. 125, ఓసీలకు రూ. 200 ఉంటుందన్నా రు. ఇందుకు సంబంధించిన పరీక్ష ఏప్రిల్ 7న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
గురుకులంలో విజిలెన్స్ తనిఖీలు
నర్సాపూర్: నర్సాపూర్‌లోని గిరిజన గురుకుల పాఠశాల, కాలేజీలో బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూంతో పాటు సరుకుల నాణ్యతను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. మరుగుదొడ్లతో పాటు తరగతి గదుల్లో పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. అన్నంలో చిన్న చిన్న రాళ్లు వస్తున్నాయని, బాత్రూంలు సరిగా లేకపోవడంతో పాటు నీటి సమస్య ఉందని పలువురు విద్యార్థులు విజిలెన్స్ అధికారుల దృష్టికి తెచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురుకులంలో తనిఖీలు నిర్వహించామని, నివేదికను వారికి అందజేస్తామని బృందం సభ్యులు తెలిపారు. తనఖీల్లో అసిస్టెంట్ జియాలజిస్టు హరికృష్ణ, ఇన్స్‌పెక్టర్ నా గుల్‌మీరా, సబ్ ఇన్స్‌పెక్టర్ ప్రవీణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
అంగన్‌వాడీలపై ప్రత్యేక శ్రద్ధ
టేక్మాల్(మెదక్): అంగన్‌వాడీ సెంటర్లపై ప్ర త్యేక శ్రద్ధ వహించాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి బ్రహ్మాజీ సిబ్బంది సూచి ంచారు. బుధవారం మండలంలోని ధన్నూర అంగన్‌వాడీ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే సరుకుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమో దు చేయాలన్నారు. ప్రతీ రోజు మెనూ ప్రకా రం భోజనం అందిస్తూ పిల్లల బరువును తప్పకుండా చూడాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహి స్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.