PECET: దరఖాస్తుకు చివరీ తేదీ ఇదే..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలల్లో B.P.Ed, U.G.D.P.Ed కోర్సుల్లో 2022–23 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీ పీసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి జూలై 19వ తేదీతో గడువు ముగుస్తుందని పీసెట్ కన్వీనర్ డాక్టర్ పి.జాన్సన్ తెలిపారు. రూ.1,000 ఆల స్య రుసుంతో 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. హాల్‌టికెట్లను ఆగస్టు 2వ తేదీ నుంచి pecet-sche.aptonline.in/PECET వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. పీసెట్ పరీక్షలు ఆగస్టు 8వ తేదీ నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మొదలవుతాయని పేర్కొన్నారు.
చదవండి:
Published date : 19 Jul 2022 01:01PM