ఫలితాల్లో అమ్మాయిల హవా
Sakshi Education
రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశపరీక్ష (సీపీజీఈటీ) ఫలితాల్లో యువతులు సత్తా చాటారు.
మొత్తం 63,748 మంది (92.61 శాతం) అర్హత సాధించిన ఈ ఫలితాల్లో ఏకంగా 41,131 మంది అమ్మాయిలు క్వాలిఫై అయ్యారు. అలాగే 22,614 మంది అబ్బాయిలు అర్హత సాధించారు. సీపీజీఈటీ ఫలితాలు, ర్యాంకులను ఓయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అక్టోబర్ 24న విడుదల చేస్తామని, 27 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. 45 పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు... 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో మొత్తం 41,174 సీట్లు అందుబాటులో ఉన్నట్లు సీపీజీఈటీ కనీ్వనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి తెలిపారు. ఎంకాం సహా కొన్ని కోర్సులపట్ల ఆదరణ తగ్గిందని ఓయూ వీసీ డి. రవీందర్ తెలిపారు. నవంబర్ నెలాఖరుకల్లా క్లాసులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
చదవండి:
Published date : 22 Oct 2021 04:36PM