Good News: భారీ సంఖ్యలో ఐబీపీఎస్ ఉద్యోగాల నోటిఫికేషన్..
Sakshi Education
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సొనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
భారీ సంఖ్యలో ఐబీపీఎస్ ఉద్యోగాల నోటిఫికేషన్..
దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఉన్న 4135 ప్రొబేషనరీ ఆఫీసర్ / మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ దరఖాస్తులు నవంబర్ 10 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. దరఖాస్తు చేసే వారు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. అదేవిధంగా స్థానిక భాష రాయడం, చదవడం తెలిసి ఉండాలి. అభ్యర్థులు 20 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.