Skip to main content

CUET: సీయూఈటీ యూజీ అడ్మిషన్ల గడువు పెంపు.. చివరి తేదీ ఇదే..

మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ) ద్వారా అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో అడ్మిషన్‌ కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తుకు గడువు తేదీని పెంచింది.
Extension of CUET UG admissions
సీయూఈటీ యూజీ అడ్మిషన్ల గడువు పెంపు.. చివరి తేదీ ఇదే..

మే 31 రాత్రి 9 గంటల వరకు అభ్యర్థుల నుంచి వచ్చిన ప్రాతినిధ్యాలను దృష్టిలో ఉంచుకుని గడువు తేదీని పొడిగించింది. మనూలోని అండర్‌ గ్రాడ్యుయేట్‌ రెగ్యులర్‌ కోర్సులైన బీఏ, బీఏ (జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్, బీకామ్‌) బీఎస్సీ (ఎంపీసీ, ఎంపీసీఎస్, బీజడ్‌సీ), బీవీఓసీ (మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ అండ్‌ మెడికల్‌ లేబొరేటరీ టెక్నాలజీ), బీటెక్, కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) మోడల్‌లో ఎన్‌టీఏ ద్వారా 2022–23 అకడమిక్‌ సెషన్‌ కోసం సీయూఈటీ ద్వారా కంప్యూటర్‌ సైన్స్‌ (పాలిటెక్నిక్‌ డిప్లొమా హోల్డర్‌ కోసం రెండవ ఏడాది బీటెక్‌ సీఎస్‌లో డైరెక్ట్‌ అండ్‌ లాటరల్‌ ఎంట్రీ) వంటి కోర్సుల్లో అవకాశం కల్పిస్తారు. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి, ఇతర వివరాలకు 011–4075 9000 ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు. అభ్యర్థులు సీయూఈటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిచేయాలన్నారు. యూజీ ప్రోగ్రామ్‌ల కోసం ప్రాస్పెక్టస్‌ వెబ్‌సైట్‌ manuu.edu.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. 

చదవండి: 

UGC – HRDC: మూడోస్థానంలో ‘మనూ’

కర్నూలు ఉర్దూ యూనివర్సిటీ వీసీగా ‘మనూ’ ప్రొఫెసర్‌

Published date : 30 May 2022 05:28PM

Photo Stories