TSPSC recruitment 2022: 833 ఇంజనీర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల
Sakshi Education
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీరింగ్ సర్వీసులకు సంబంధించి 833 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) సెప్టెంబర్ 12 న నోటిఫికేషన్ విడుదల చేసింది.
TSPSC notifies 833 Assistant Engineer
అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ కేటగిరీల్లో ఖాళీలున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 23న టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ కార్యదర్శి తెలిపారు.
ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. మరిన్ని వివరాలకు కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.