Skip to main content

TSPSC : టీఎస్‌పీఎస్సీ 833 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) 833 ఉద్యోగాల‌కు నోటిఫికేషన్ విడుద‌ల చేసింది.
TSPSC
TSPSC Jobs Notification

వివిధ విభాగాల్లోని 833 ఇంజినీరింగ్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ సెప్టెంబ‌ర్ 12వ తేదీన (సోమ‌వారం) ఒక ప్రకటనను జారీ చేసింది. ఈ ఉద్యోగాల‌కు సెప్టెంబ‌ర్ 29 నుంచి అక్టోబర్‌ 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

AEE Jobs Notification : 1540 ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుద‌ల‌.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

మున్సిపల్‌ అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టులు, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

నోటిఫికేష‌న్ల జాత‌ర‌..
తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) మున్సిపల్ శాఖలోని 175 టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్ ఉద్యోగాల‌కు ఇటీవ‌లే నోటిఫికేష‌న్ జారీ చేసిన విష‌యం తెల్సిందే. అలాగే మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో మహిళా శిశు సంక్షేమ అధికారి పోస్టుల భర్తీకి కూడా అర్హులైన‌ మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీక‌రిస్తుంది.

DAO Grade 2 Syllabus: డీఏఓ గ్రేడ్‌-2 రాత‌ప‌రీక్ష సిల‌బ‌స్ ఇదే.. వీటిపై ప‌ట్టు ఉంటే విజ‌యం మీదే..

ఇటీవ‌లే వివిధ విభాగాల్లో 1540 ఏఈఈ పోస్టుల భర్తీకి తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్‌ను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. తెలంగాణ‌లొ నోటిఫికేషన్ల‌ల ప‌రంప‌ర కొన‌సాగుతుంది. ముఖ్యంగా ఈ నోటిఫికేష‌న్లు ఇంజ‌నీరింగ్ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌గా చెప్ప‌వ‌చ్చును.

TSPSC Jobs Notification 2022 : తెలంగాణ మున్సిపల్ శాఖలోని ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. మొత్తం ఎన్ని పోస్టులంటే..

Published date : 12 Sep 2022 07:51PM
PDF

Photo Stories