Skip to main content

TSPSC Jobs Notification 2022 : తెలంగాణ మున్సిపల్ శాఖలోని ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. మొత్తం ఎన్ని పోస్టులంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) మున్సిపల్ శాఖలోని ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ చేసింది. తెలంగాణ మున్సిపల్ శాఖలో 175 టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది.
TSPSC
TSPSC Job Notification

సెప్టెంబ‌ర్ 20వ తేదీ నుంచి అక్టోబరు 13వ తేదీ సాయంత్రం 5:00 గంట‌లోపు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఒక‌ ప్రకటనలో తెలిపింది. వ‌యోప‌రిమితి 18-44 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి. ఈ ఉద్యోగాల‌కు వేత‌నం రూ.32,810-96,890 మ‌ధ్య ఉంటుంది. ఈ ప‌రీక్ష జన‌వ‌రి నెల‌ 2023లో జ‌రిగే అవ‌కాశం ఉంది.

చ‌ద‌వండి: TSPSC Groups Success Tips: కోచింగ్‌కు వెళ్లడం శుద్ధ దండగ.. ఇలా చ‌దివితే నెలలో ‘గ్రూప్స్‌’ కొట్టొచ్చు..

రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి పోస్టుల భర్తీకి..
మరోవైపు ఇటీవలే తెలంగాణ రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 23 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సెప్టెంబ‌ర్ 13వ తేదీ నుంచి అక్టోబరు 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్ల‌డించింది.

గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

చ‌ద‌వండి: Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!

1,540 ఏఈఈ పోస్టుల‌ను కూడా..
పలు విభాగాల్లో 1,540 సహాయ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ఏఈఈ(సివిల్‌)-పీఆర్‌-ఆర్‌డీ డిపార్ట్‌మెంట్‌(మిషన్‌ భగీరథ)-302, ఏఈఈ(సివిల్‌)-పీఆర్‌-ఆర్‌డీ డిపార్ట్‌మెంట్‌-211, ఏఈఈ(సివిల్‌)ఎంఏ-యూడీపీహెచ్‌-147, ఈఈ(సివిల్‌)టీడబ్ల్యూ డిపార్ట్‌మెంట్‌-15, ఏఈఈఐ-సీఏడీ డిపార్ట్‌మెంట్‌-704,ఏఈఈ(మెకానికల్‌)ఐసీఏడీ(జీడబ్ల్యూడీ)-3,ఏఈఈ(సివిల్‌)టీఆర్‌-బి-145,ఏఈఈ(ఎలక్ట్రికల్‌)టీఆర్‌-బి-13 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ సూచించారు.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Published date : 07 Sep 2022 08:17PM
PDF

Photo Stories