సైన్స్ పరిశోధనలు...ఆసక్తితోనే అందలం !!
Sakshi Education
‘సైన్స్ రంగంలో అవకాశాలు విస్తృతమవుతున్నాయి. అదే సమయంలో నిపుణుల కొరత పెరుగుతోంది. సైన్స్ రంగంలో పరిశోధనల ద్వారా కొత్త ఆవిష్కరణలు చేసే నైపుణ్యమే కాకుండా.. మరెన్నో విషయాల్లో విజ్ఞానం సొంతమవుతుంది’ అంటున్నారు హనీవెల్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అక్షయ్ బెళ్లారే. ఐఐటీ-చెన్నై నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్, ఆ తర్వాత వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకొని అంతర్జాతీయంగా, జాతీయంగా పలు సంస్థల్లో ఆర్ అండ్ డీ విభాగాల్లో అనుభవం గడించిన అక్షయ్ బెళ్లారేతో ఈ వారం గెస్ట్ కాలమ్...
స్టెమ్‌లో.. సైన్స్ ప్రత్యేకం:
ప్రస్తుతం స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్)విభాగంలో నిపుణుల కొరత గురించి చర్చ జరుగుతున్న మాట వాస్తవవే. ఈ రంగంలో మరింత మంది నిపుణులను తీర్చిదిద్దాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్టెమ్ విభాగంలో సైన్స్ ప్రత్యేకమని చెప్పొచ్చు. స్టెమ్‌లోని మిగతా మూడు విభాగాలకు సైన్స్ బేసిక్స్ మూలం. అందుకే మొత్తం స్టెమ్ నిపుణుల కొరతలో.. సైన్స్ నిపుణుల కొరతే 30శాతం మేరకు ఉంటోంది. స్టెమ్ నిపుణులకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మరోవైపు స్కిల్ గ్యాప్ సమస్య కూడా ఉంది.
పెరుగుతున్న అవగాహన...
సైన్స్ కోర్సుల అభ్యసనం పరంగా ఇటీవల కాలంలో విద్యార్థుల దృక్పథంలో మార్పు కనిపిస్తోంది. విద్యార్థులు నెమ్మదిగా సైన్స్ కోర్సుల దిశగా అడుగులేస్తున్నారు. విద్యార్థులు సైన్స్ వైపు దృష్టిపెట్టేలా పాఠశాల స్థాయి నుంచే చర్యలు చేపట్టాలి. అందుకు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల సైన్స్ పట్ల విద్యార్థుల్లో సహజ ఆసక్తి రెట్టింపవుతుంది. భవిష్యత్తులో సైన్స్ చదువుల దిశగా అడుగులు వేసేందుకు స్ఫూర్తినిస్తుంది.
సుస్థిర భవిష్యత్తు:
సైన్స్ రంగంలో.. ఉన్నత కెరీర్ అవకాశాలు అందుకునేందుకు సుదీర్ఘ సమయం పడుతుందనే వాదన ఉంది. అయితే సైన్స్ కెరీర్‌లో ఒకసారి కుదురుకుంటే వెనుదిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు. స్కూల్ స్థాయి నుంచి సైన్స్ సబ్జెక్టులపై ఆసక్తి పెంచుకొని.. ఏకాగ్రత, పట్టుదలతో కృషి చేస్తే 27ఏళ్ల వయసు వచ్చేసరికి కెరీర్ గమ్యం చేరుకోవచ్చు. ఇంజనీరింగ్ విభాగంలో.. బీటెక్ పూర్తికాగానే ఉద్యోగాలు లభిస్తున్నాయి. కానీ.. ఆయా ఉద్యోగాల్లో మనుగడ సాగించాలన్నా, మరింత పైస్థాయికి ఎదగాలన్నా.. ఉన్నత విద్య అవసరం. సైన్స్లో పీహెచ్‌డీ పూర్తి చేసుకుంటే.. అవకాశాలకు ఢోకా ఉండదు.
డెమోగ్రాఫిక్ డివిడెండ్ :
ప్రస్తుతం మన వద్ద ఉన్న అద్భుత ఆయుధం డెమోగ్రాఫిక్ డివిడెండ్. అంటే.. మన దగ్గర 14ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు యువత సంఖ్య గణనీయంగా ఉంది. కాబట్టి మన యువతను సైన్స్ వైపు దృష్టిసారించేలా చేస్తే.. మనం కూడా యూఎస్, కెనడా, జపాన్‌ల మాదిరిగానే ఆర్ అండ్ డీ రంగంలో అద్భుతాలు సృష్టించొచ్చు. ఎంతోమంది యువత 25, 26 ఏళ్ల వయసులోనే సొంతంగా సంస్థలు నెలకొల్పి అద్భుతాలు సృష్టిస్తున్నారు. వ్యాపార మెళకువలతో అభివృద్ధి పథంలో నడుస్తున్నారు.
పరిశోధనలతో ఉన్నత శిఖరాలు :
సైన్స్ రంగంలో ఉన్నత శిఖరాలు అందుకోవాలంటే.. పరిశోధనలపై దృష్టిపెట్టడం ముఖ్యం. పరిశోధనల ఫలితంగా కొత్త ఆవిష్కరణలతోపాటు మరెన్నో అంశాల్లో పరిజ్ఞానం లభిస్తుంది. సమస్య విశ్లేషణ, సమస్య పరిష్కారం, పరిశోధన దృక్పథం, ప్రాక్టికల్ అప్రోచ్.. ఇలా ఎన్నో నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు పరిశోధనలు దోహదం చేస్తాయి. రీసెర్చ్ ఔత్సాహికులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఇటీవల పలు చర్యలు, ప్రోత్సాహకాలు అందిస్తున్న మాట వాస్తవమే. ఇవి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులకే పరిమితమైతే ప్రయోజనం ఉండదు. ఇలాంటి ప్రోత్సాహకాలు అన్ని స్థాయిల ఇన్‌స్టిట్యూట్‌లకూ విస్తరించే విధంగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే అన్ని ప్రాంతాల నుంచి భావి సైంటిస్ట్‌లు రూపొందుతారు.
ఆసక్తి ప్రధానం :
సైన్స్ పరిశోధనల్లో అడుగుపెట్టాలనుకునే విద్యార్థులకు సంబంధిత సబ్జెక్టుపై సహజ ఆసక్తి ఉండాలి. అప్పుడే ఈ విభాగంలో సమర్థవంతంగా రాణించే వీలుంటుంది. లేకుంటే మధ్యలోనే అడుగులు తడబడతాయి. గమ్యం చేరుకోవడం కష్టంగా మారుతుంది. కాబట్టి సైన్స్ పట్ల నిజంగా ఆసక్తి ఉంటేనే ఈ రంగంలో అడుగుపెట్టాలి. ఇక తల్లిదండ్రుల ఆలోచనా దక్పథంలోనూ మార్పులు రావాలి. ఇంజనీరింగ్, మెడిసిన్ అనే కాకుండా.. పిల్లల ఆసక్తి మేరకు వారిని చదివించాలి. అది సైన్స్ అయినా.. ఆర్‌ట్స అయినా సరే! విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న రంగంలో ఉన్నత అవకాశాల గురించి తెలుసుకోవాలి. వాటిని అందుకునే విధంగా పట్టుదలతో ప్రయత్నం చేస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు!!

Published date : 26 Jul 2018 05:59PM