Skip to main content

ఈ నైపుణ్యాలు ఉంటేనే...కొలువులు మీ సొంతం : ఐఐఎం-ఉదయ్‌పూర్ డెరైక్టర్ ప్రొఫెసర్. జనత్ షా

ఫ్యూచర్ బిజినెస్ లీడర్స్‌గా ఎదగాలనుకునే మేనేజ్‌మెంట్ విద్యార్థులకు దీర్ఘకాలిక లక్ష్యం ఉండాలి. వాస్తవ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. అప్పుడే భవిష్యత్తు సుస్థిరంగా ఉంటుంది.

ఉన్నత స్థానాలు చేరుకునే అవకాశం సొంతమవుతుంది అంటున్నారు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-ఉదయ్‌పూర్ డెరైక్టర్ ప్రొఫెసర్ జనత్ షా. ఐఐటీ బాంబే నుంచి బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎఫ్‌పీఎం పూర్తిచేసిన షా..ఆర్గనైజేషనల్ బిహేవియర్, సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో విస్తృత అధ్యయనం చేశారు. పలు కార్పొరేట్ సంస్థల సమస్యలకు పరిష్కారంతోపాటు మేనేజ్‌మెంట్ విద్యా బోధనలో నాలుగు దశాబ్దాల అనుభవం గడించి.. ప్రస్తుతం ఐఐఎం-ఉదయపూర్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ జనత్ షాతో ఈ వారం గెస్ట్ కాలమ్.

 ఆసక్తి పెరుగుతోంది.. కానీ

 గత దశాబ్ద కాలంగా మేనేజ్‌మెంట్ విద్య పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతున్న మాట వాస్తవమే. అందుకే టైర్-1 ఇన్‌స్టిట్యూట్‌లు మొదలు టైర్-3 ఇన్‌స్టిట్యూట్‌ల వరకు బీ-స్కూల్స్‌లో ప్రవేశాల్లో విపరీతమైన పోటీ నెలకొంటోంది. చాలామంది విద్యార్థులు జాబ్ మార్కెట్ ట్రెండ్‌ను చూసి.. ఎంబీఏ పూర్తికాగానే ఉద్యోగం ఖాయమనే అభిప్రాయంతో ఉంటున్నారు. నిజమైన ఆసక్తి, ఈ రంగంలో నిపుణులుగా ఎదగాలనుకునే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది.  అందుకే ఎంబీఏ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులం దరికీ ఉద్యోగ నైపుణ్యాలు లభించడం లేదు. పర్యవసానంగా జాబ్ మార్కెట్‌లో నిరాశ ఎదురవుతోంది. ఏ ఉద్దేశంతో ఈ కోర్సు లో చేరినా.. ఆసక్తిని పెంచుకుంటూ, వాస్తవ పరిస్థితులపై అవగా హనతో ముందుకు సాగితే ఎంప్లాబిలిటీ స్కిల్స్ అలవడుతాయి. తద్వారా కార్పొరేట్ కంపెనీల్లో కొలువులు సొంతమవుతాయి.


 కేస్ స్టడీలకు ప్రాధాన్యం: 
 మేనేజ్‌మెంట్ విద్యార్థులు తమ నైపుణ్యాలు పెంచుకోవడంలో భాగంగా కేస్ స్టడీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ కేస్ స్టడీలు వాస్తవ పరిస్థితుల్లో చేయాలి. అంటే.. ఆయా పరిశ్రమలకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి.. వాటికి పరిష్కార మార్గాలు చూపాలి. రియల్ కేస్ స్టడీస్ విషయంలో టైర్-1 బీ-స్కూల్స్ ముందంజలో ఉన్నాయి. కంపెనీలు ఈ టాప్ బీ-స్కూల్స్ నిపుణులతో కలిసి.. తమ సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనే ప్రయత్నం చేస్తున్నాయి. సదరు బీ-స్కూల్స్ తమ విద్యార్థులు వీటిలో పాల్పంచుకునే అవకాశం కల్పిస్తున్నాయి. ఫలితంగా వారికి క్షేత్ర స్థాయి సమస్యలపై అవగాహన లభిస్తోంది. సమస్యలు పరిష్కరించడంలో అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపైనా నైపుణ్యం సొంతమవుతోంది. 


{Mిటికల్ థింకింగ్, అనలిటికల్ అప్రోచ్ : 
 మేనేజ్‌మెంట్ విద్యార్థులకు క్రిటికల్ థింకింగ్,అనలిటికల్ అప్రోచ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలు ఎంతో ముఖ్యం. వాస్తవ పరిస్థితుల్లో సమస్యలు పరిష్కరించే క్రమంలో ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి. సమస్యకు కారణం, పరిష్కార మార్గాలు, అత్యుత్తమ పరిష్కారం వంటి వాటిని గుర్తించడానికి ఈ మూడు లక్షణాలు దోహద పడతాయి. ఇలాంటి నైపుణ్యాల ద్వారా భవిష్యత్తులో కెరీర్‌లో త్వరగా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.


 వీటికి అలవాటు పడాల్సిందే...
 {పస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు.. ఆన్‌లైన్, డిజిటల్ వేదికలకు అలవాటు పడాల్సిన ఆవశ్యకత నెలకొంది. ఇది మరికొన్ని నెలలు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి విద్యార్థులు ఆన్‌లైన్ అభ్యసన సామర్థ్యాలను పెంచుకోవాలి. డిజిటల్‌గా అందుబాటులో ఉన్న సాధనాలను సద్వినియోగం చేసుకో వాలి. తమ బీస్కూల్ అధ్యాపకుల బోధనతోపాటు సదరు అంశానికి సంబంధించి ఆన్‌లైన్‌లో లభించే ఇతర ప్రొఫెసర్ల పాఠాలను కూడా అనుసరించాలి. ఫలితంగా ఒకే అంశంపై విభిన్న కోణాల్లో నైపుణ్యం లభిస్తుంది. ఐఐఎ-ఉదయ్‌పూర్ క్యాంపస్‌లోనూ ఈ ఏడాది కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా  ఆన్‌లైన్ క్లాస్‌లను నిర్వహిస్తున్నాం. ఆన్‌లైన్ క్లాస్‌లు విద్యార్థులకు కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు. ముఖ్యంగా ఫ్యాకల్టీ కొరత ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థుల విషయంలో ఇది ఎంతో ఉపయుక్తం. ఇప్పటివరకు ఆన్‌లైన్ లెక్చర్స్ గురించి అంతగా ఆలోచించని విద్యార్థులు సైతం వీటిపై దృష్టి సారిస్తున్నారు.

 సప్లయ్ చైన్..భేష్ :

 సప్లయ్ చైన్ విభాగంలో రానున్న రోజుల్లో విస్తృతమైన ఉపాధి అవకాశాలు లభించడం ఖాయం. వాస్తవానికి ఈ-కామర్స్ అడుగుపెట్టి నప్పటి నుంచే సప్లయ్ చైన్ నిపుణులకు డిమాండ్ నెలకొంది. ప్రస్తుత కొవిడ్ పరిస్థితులు, సంస్థల మధ్య పోటీ వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్‌లో కొలువులకు కొదవే లేదని చెప్పొచ్చు. ఈ విభాగంలో మానవ వనరుల కోణంలో డిమాండ్-సప్లయ్ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. మేనేజ్‌మెంట్ విద్యార్థులు దీన్ని అందిపుచ్చుకుంటే ఈ రంగంలో మెరుగైన భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు.

 

పెరుగుతున్న మహిళా విద్యార్థుల సంఖ్య : 

 ఐఐఎంలలో ఇటీవల కాలంలో మహిళా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. దీనికి కారణం అన్ని ఐఐఎంలు తీసుకుంటున్న జండర్ డైవర్సిటీ విధానమే. మహిళలకు ఎంపిక ప్రక్రియలో ప్రత్యేక వెయిటేజీ కల్పిస్తున్నాం. ఎక్కువ మంది మహిళా విద్యార్థులు మేనేజ్‌మెంట్ విద్యలో అడుగు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. చాలా మంది విద్యార్థినులకు మేనేజ్‌మెంట్ విద్య అభ్యసించాలని ఉన్నప్పటికీ.. క్యాట్‌లో పోటీని చూసి వెనుకడుగు వేస్తున్నారు. 

 

 క్యాట్‌కు హాజరైన వారికి సలహా..

 ఇటీవల ముగిసిన క్యాట్ పరీక్షకు హాజరైన విద్యార్థులకు ఇచ్చే సలహా.. క్యాట్ స్కోర్ ఆధారంగా ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు చేపట్టే తదుపరి ఎంపిక ప్రక్రియలో విజయానికి ఇప్పటి నుంచే కృషి చేయాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్, కాంటెంపరరీ ఇష్యూస్‌పై అవగాహన పెంచుకుంటే..  తదుపరి ఎంపిక ప్రక్రియలో మెరుగైన ప్రతిభ చూపే అవకాశం ఉంటుంది!!

Published date : 21 Dec 2020 04:13PM

Photo Stories