Training: సివిల్ ఇంజనీర్లకు శిక్షణతో కూడిన కొలువులు
Sakshi Education
సివిల్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన గిరిజన విద్యార్థులకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్రక్షన్(న్యాక్) సహకారంతో శిక్షణతో కూడిన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ వెల్లడిం చారు.
సివిల్ ఇంజనీర్లకు శిక్షణతో కూడిన కొలువులు
ఇప్పటికే 3 బృందాలకు శిక్షణతో కూడిన ఉపాధి కల్పించామని, తాజాగా 4వ బ్యాచ్‌లో 39 మంది గిరిజన ఇంజనీర్లకు ఉద్యోగాలు కల్పించా మని వివరించారు. జూన్ 6న ఆయా అభ్యర్థు లకు ప్లేస్‌మెంట్ ఆఫర్ లెటర్లను అందించారు. పట్టుదల, క్రమశిక్షణతో ముందుకెళ్తే ఉన్నత శిఖ రాలు చేరతారని తెలిపారు.