Engineering: మిగులు సీట్లు... కాలేజీల పాట్లు
విద్యార్థులను ఆకర్షించేందుకు యాజమాన్యాలు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇందుకోసం మధ్యవర్తులను, పూర్వ విద్యార్థులను రంగంలోకి దించుతున్నాయి. 2021లో విద్యార్థులంతా కంప్యూటర్ సైన్స్ బ్రాంచిపై ఆసక్తి చూపారు. దీంతో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో భారీగా సీట్లు మిగిలే అవకాశం కని్పస్తోంది. వీటిని భర్తీ చేసుకోవడం కాలేజీలకు సవాల్‌గా మారింది. ఎంతో కొంత రాబట్టుకుని ఆ సీట్లు ఇచ్చేందుకు కాలేజీలు సిద్ధపడుతున్నాయి. టాప్‌టెన్ కాలేజీల్లో కంప్యూటర్ దాని అనుబంధ కొత్త కోర్సులకు మంచి గిరాకీ ఏర్పడింది. కానీ ఇతర సంప్రదాయ కోర్సుల సీట్ల భర్తీ టాప్‌టెన్ కాలేజీలకూ సమస్యగానే మారింది. ఇక సాధారణ ఇంజనీరింగ్ కాలేజీల్లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. సివిల్, మెకానికల్ కోర్సుల కోసం ఏ మాత్రం పోటీ లేదు. దీంతో విద్యార్థులను వెతికి పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఓ కాలేజీ నిర్వాహకుడు తెలిపాడు. నిజానికి ఈ ఏడాది డిమాండ్ లేని కోర్సుల్లో దాదాపు 2 వేల సీట్లు కాలేజీలు వదులుకున్నాయి. అయినా మిగిలిన సీట్ల భర్తీ కూడా కష్టంగానే ఉంది.
ఆ కోర్సుల భర్తీ కష్టమే
యాజమాన్య కోటా సీట్ల భర్తీ ప్రక్రియ వాస్తవానికి ఇప్పటికే ముగించాలి. నవంబర్ నెలాఖరులోగా భర్తీ అయిన సీట్లు, తీసుకున్న విద్యార్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి పంపాలి. కన్వీనర్ కోటా కింద ఇప్పటివరకు 79,790 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. యాజమాన్య కోటా కింద మరో 32 వేల సీట్లున్నాయి. అయితే కనీ్వనర్ కోటా సీట్లే ఇప్పటి వరకు 19,797 మిగిలిపోయాయి. ఇందులో సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్ కోర్సులు ఎక్కువగా ఉన్నాయి. సివిల్‌లో 3,629 కన్వీనర్ కోటా సీట్లు, మరో 1,500 వరకు యాజమాన్య కోటా సీట్లు మిగిలిపోయాయి. మెకానికల్‌లో దాదాపు 5 వేల సీట్లు (యాజమాన్య, కనీ్వనర్) ఇంకా భర్తీ కాలేదు. కంప్యూటర్ సైన్స్, కొత్తగా వచి్చన కోర్సుల్లో సీట్లు 35 వేలకుపైగా ఉంటే, 95 శాతం వరకు భర్తీ అయ్యాయి. యాజమాన్య కోటా సీట్లు గ్రామీణ ప్రాంతాల్లో మినహా అంతటా హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. సివిల్, మెకానికల్, ఈఈఈ కోర్సులను కొన్ని కాలేజీల్లో చేసేందుకే విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. అది కూడా 65 శాతమే భర్తీ అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
చదవండి:
Engineering: ఇంజనీరింగ్ క్లాసులు ప్రారంభ తేదీలు
UPSC Recruitment: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
AP EAPCET 2021 Seats : ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లోని సీట్ల కేటాయింపు వివరాలు ఇలా..