AP EAPCET 2021 Seats : ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లోని సీట్ల కేటాయింపు వివరాలు ఇలా..
ఏపీ ఈఏపీసెట్-2021లో 1,34,205 మంది విద్యార్థులు అర్హత సాధించగా, కౌన్సెలింగ్‌కు 90,606 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 89,232 మంది వెబ్ ఆప్షన్లలో పాల్గొన్నారు. గత ఏడాదికన్నా ఎక్కువ సంఖ్యలో ఈ ఏడాది ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. గత ఏడాది తొలి విడత కౌన్సెలింగ్‌లో 83,014 మంది ఆప్షన్లు నమోదు చేసుకోగా, ఈసారి అంతకంటే ఎక్కువే పాల్గొన్నారు. గత ఏడాదికంటే ఈసారి వెబ్ ఆప్షన్లలో ఎక్కువమంది పాల్గొనడం విశేషం.
సీట్లు ఖాళీ కాకుండా..
ఐఐటీ, ఎన్‌ఐటీ, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, అడ్వాన్స్‌డ్‌లలో ర్యాంకులు పొందిన రాష్ట్ర విద్యార్థుల సంఖ్య 3 వేలకు పైగా ఉంటుందని అంచనా. వీరు ఏపీ ఈఏపీసెట్‌లోనూ మెరిట్‌లో ఉన్నారు. వీరంతా జాతీయ సంస్థల్లో చేరేందుకే ప్రాధాన్యమిస్తారు. జేఈఈ ప్రవేశాలకన్నా ముందే రాష్ట్ర కాలేజీల్లో ప్రవేశాలు నిర్వహించడం వల్ల ఈ విద్యార్థులు రాష్ట్ర కాలేజీల్లో సీట్లు పొందేవారు. తరువాత వారు జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అ«థారిటీ) కౌన్సెలింగ్‌లో జాతీయ సంస్థల్లో సీట్లు పొందితే రాష్ట్ర కాలేజీల్లోని సీట్లను వదులుకోవడం ద్వారా అవి ఖాళీ అయ్యేవి. దీనివల్ల ఈఏపీసెట్‌లో వారి తరువాత మెరిట్‌లో ఉండే విద్యార్థులకు మొదటి కౌన్సెలింగ్‌లో నష్టం వాటిల్లేది. ఇçప్పుడు జోసా కౌన్సెలింగ్ అనంతరం ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ నిర్వహించడం వల్ల వారికి తొలి కౌన్సెలింగ్‌లో మేలు జరుగుతుంది. జేఈఈలో ర్యాంకులు పొందిన వారు జాతీయ విద్యా సంస్థలకు వెళ్లిపోవడంతో వారి తర్వాత మెరిట్‌లో ఉన్న వారికి అవకాశం కలుగుతోంది.
ప్రైవేటు వర్సిటీల్లోనూ కన్వీనర్ కోటా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న ప్రత్యేక చర్యల కారణంగా ఈ ఏడాది నుంచి ప్రైవేటు యూనివర్సిటీల్లోని కోర్సుల్లో 35 శాతం సీట్లు పేద మెరిట్ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ వర్సిటీలతో సంప్రదింపులు జరిపి, కన్వీనర్ కోటా సీట్లకు ఒప్పించడంతో పాటు అది తక్షణమే కార్యాచరణలోకి వచ్చేలా ప్రత్యేక ఉత్తర్వులు జారీచేయించారు. వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమరావతిలో 1,264 సీట్లు, ఎస్‌ఆర్‌ఎం విజయవాడలో 413 సీట్లు, బెస్ట్ యూనివర్సిటీ అనంతపురంలో 168 సీట్లు, సెంచూరియన్ యూనివర్సిటీ టెక్కలిలో 273 సీట్లు మొత్తం 2,118 సీట్లను కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ విద్యార్థులకు అయ్యే ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. ఇప్పటివరకు ఈ వర్సిటీల్లో కోర్సులకు వారు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో మెరిట్ సాధించడంతోపాటు లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి వచ్చేది. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా సైన్సు వంటి కోర్సులకు భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాలి. వీటిలో చదివిన వారిలో అధికశాతం విద్యార్థులకు అత్యుత్తమ ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ చొరవ కారణంగా పేద మెరిట్ విద్యార్థులు తొలిసారిగా ప్రైవేటు వర్సిటీల్లో అడుగిడబోతున్నారు.
ప్రైవేటు వర్సిటీల్లోని వివిధ కోర్సుల్లో మొత్తం సీట్లు, కన్వీనర్ కోటా (35 శాతం) సీట్ల సంఖ్య ఇలా..
కోర్సు | మొత్తం సీట్లు | కన్వీనర్ కోటా |
5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ | 350 | 123 |
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ | 120 | 42 |
సివిల్ | 30 | 11 |
కంప్యూటర్ సైన్సు | 4,360 | 1,524 |
సైబర్ సెక్యూరిటీ | 120 | 42 |
డేటా సైన్స్ | 120 | 42 |
ఈసీఈ | 510 | 179 |
ఈఈఈ | 30 | 11 |
మెకానికల్ | 410 | 144 |
మొత్తం | 6,050 | 2,118 |
ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్ల కేటాయింపు సమాచారం...
ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈఏపీసెట్ సీట్ల కేటాయింపు ప్రక్రియ మళ్లీ వాయిదా పడింది.ఈ విషయాన్ని సెట్ అడ్మిషన్ల కన్వీనర్ పోలా భాస్కర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. నవంబర్ 16వ తేదీన(సోమవారం) సీట్ల కేటాయింపు చేయనున్నామని తెలిపారు. వాస్తవానికి ముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 10న ఏపీ ఈఏపీసెట్ మొదటి విడత సీట్ల కేటాయింపు జరగాల్సి ఉంది. అయితే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 శాతం కోటాపై సందిగ్ధం ఏర్పడడంతో సీట్ల కేటాయింపును వాయిదా వేశారు. అయితే 12న కూడా సీట్ల కేటాయింపు జరగలేదు. తాజాగా 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్ ప్రకటించారు.
As per official note, 80935 convener were filled and 30369 seats are unfilled..
చదవండి:
AP Top-50 Engineering Colleges List
Must Check: AP EAMCET College Predictor
Engineering Seats : ఏ కోర్సులో ఎన్ని సీట్లు ఉన్నాయంటే..?
EAMCET Counselling : నవంబర్ 20 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్..సీట్లు పొందిన విద్యార్థులు..
Engineering : ఇంజనీరింగ్‌లో సీట్లు కేటాయింపు...ఈ కోర్సులకే క్రేజ్ ఎక్కువ..