Skip to main content

Engineering: సంప్రదాయ కోర్సులకు మంగళం?

New Engineering Course
New Engineering Course

ఇంజినీరింగ్‌లో కొత్త పోకడలు 

  •      డిమాండ్‌ కోర్సులపై ప్రైవేటు కళాశాలల దృష్టి 
  •      సివిల్, మెకానికల్‌ కోర్సులు ఎత్తివేయాలని వినతి 
  •      కంప్యూటర్‌ కోర్సులకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ 
  •      వందల సంఖ్యలో జేఎన్‌టీయూకు దరఖాస్తులు 
  •      కోర్‌ బ్రాంచ్‌లు కనుమరుగవడం సరికాదంటున్న మేధావులు 

సాక్షి, కాకినాడ:   ఇంజినీరింగ్‌లో సంప్రదాయ కోర్సులకు మంగళం పాడే దిశగా అడుగులు పడుతున్నాయి. డిమాండ్‌ లేని కోర్సులను ఎత్తేసి, విద్యార్థులు కోరుకునే కోర్సులకు ప్రాధాన్యం కలి్పంచేందుకు ప్రైవేటు కళాశాలలకు అఖిలభారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతి ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు జేఎన్‌టీయూ కాకినాడ పరిధిలోని 180 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సింహభాగం తమ కళాశాలల్లో కోర్‌ బ్రాంచ్‌లు ఎత్తేయాలని కోరడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ అంశంపై వర్శిటీ అధికారులు విచారణ జరపనున్నారు. మూడేళ్లుగా 30 శాతం సీట్లు భర్తీ కాలేదని కాలేజీలు సరైన ఆధారాలు చూపిస్తే ఆ కోర్సులు ఎత్తేసేందుకు నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) ఇచ్చే సూచనలు సైతం కనిపిస్తున్నాయి. దీని ఆధారంగా కాలేజీలు సంప్రదాయ కోర్సుల స్థానంలో కంప్యూటర్, కంప్యూటర్‌ సంబంధిత సీట్లు తెచ్చుకునే వీలుంది. 

Also read: APPSC Group 1 2018 Interviews: స్పోర్ట్స్‌ కోటా తాత్కాలిక జాబితా

ఎందుకిలా.. 
మూడేళ్లుగా ఇంజినీరింగ్‌ విద్యా విధానంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. కంప్యూటర్‌ కోర్సుల్లో పరిచయమైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ వంటి కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. జేఎన్‌టీయూ(కే) వర్శిటీ అనుబంధ కళాశాలల్లో 95 శాతం సీట్లు ఈ కోర్సుల్లోనే భర్తీ అవుతున్నాయి. మరో వైపు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ కోర్సుల్లో సగానికిపైగా సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ పరిణామం రాబోయే రోజుల్లో అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని విద్యా వేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 27 కళాశాలలుండగా.. కన్వీనర్‌ కోటా సీట్లు 10,766 ఉన్నాయి. ఇం దులో 8,487 సీట్లు భర్తీ అయ్యాయి. 2,279 సీట్లు మిగిలిపోయాయి. అత్యధికంగా సీఎస్‌ఈ 4,543 సీట్లు భర్తీ కాగా.. సివిల్‌ 455, మెకానికల్‌ 527 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈసీఈ 1,947, ఈఈఈ 616 భర్తీ అయ్యాయి. వీటిల్లో కూడా అత్యధికంగా 4,543 సీట్లు కంప్యూటర్, దాని అనుబంధ కోర్సులే నిలవడం ఇందుకు దర్శనమిస్తోంది.  

Also read: Private Teachers ‘ఉపాధి’ తిప్పలు

తక్షణ ఉద్యోగమని.. 
ఇంజినీరింగ్‌ ముగిసిన వెంటనే తక్షణంæ ఉపాధి పొంవదచ్చనే ఉద్దేశంతో విద్యార్థులు ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్‌ను ఎంచుకుంటున్నారు. కొంతమంది అమెరికా వంటి విదేశాలకు వెళ్లేందుకు కూడా కంప్యూటర్‌ కోర్సుల బాట పడుతున్నారు. ఈ కోర్సులకు సంబంధించి కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ, మౌలిక వసతులు లేకున్నా విద్యార్థులు ఇదే దారిలో పయనిస్తున్నారు. వాస్తవనికి ఈ కోర్సులు చేసినప్పటికీ 8 శాతం మాత్రమే స్కీల్డ్‌ ఉద్యోగాలు పొందుతున్నట్లు ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. కానీ విద్యార్థుల డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు కాలేజీలు కంప్యూటర్‌ కోర్సుల సీట్లు వీలైనంత పెంచుకునే ప్రయతి్నస్తున్నాయి. ఈ క్రమంలో డిమాండ్‌ లేని మెకానికల్, సివిల్‌ కోర్సుల ఎత్తివేతకు రంగం సిద్ధం చేశాయి. వర్శిటీ ఎన్‌ఓసీ ఇస్తే వేల సంఖ్యలో మెకానికల్, సివిల్‌ ఇంజినీరింగ్‌ సీట్లు లేకుండా పోయే అవకాశం ఉంది. 

Also read: AWS learning plan

సంప్రదాయ కోర్‌ బ్రాంచ్‌ల పరిస్థితి ఏంటి ?  
సంప్రదాయ కోర్సులు కనుమరుగు కావడం భవిష్యత్తులో దుష్పరిణామాలకు దారి తీస్తుందని నిపుణులు భావిస్తున్నారు ముఖ్యంగా పాలిటెక్నిక్‌ కోర్సులు చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్‌ రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశం పొందే వీలుంది. సంప్రదాయ కోర్సుల్లో సీట్లన్నీ ఎత్తేస్తే వాళ్ల పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పాలిటెక్నిక్‌లో కేవలం సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ వంటి కోర్సులు మినహా కంప్యూటర్‌ కోర్సులు లేకపోవడం గమనార్హం.  

Also read: 10 Lakh Jobs : కీలక నిర్ణయం.. 18 నెల‌ల్లో 10 లక్షల ఉద్యోగాలు భ‌ర్తీ..?

భవిష్యత్తులో పెరగనున్న అవసరం:  
కట్టడాలు, నిర్మాణాలు, డిజైన్లకు సంబంధించి మూల భావనలు, నైపుణ్యాలు అందించడం సివిల్‌ ఇంజనీరింగ్‌ కోర్సు ముఖ్య స్వరూపం. ప్రస్తుతం పట్టణీకరణ, రియలీ్ట, మౌలిక సదుపాయాల రంగాల విస్తరణ జరుగుతోంది. ప్రభుత్వం మౌలిక సదుపాయాల విస్తరణపై దృష్టిపెట్టడంతో ప్రభుత్వ రంగంలోనూ సివిల్‌ ఇంజనీర్లకు డిమాండ్‌ పెరుగుతోంది. మరోవైపు ప్రైవేటు రంగంలోనూ రియల్‌ ఎస్టేట్‌  శరవేగంగా విస్తరిస్తోంది. కార్పొరేట్‌ సంస్థలు సైతం నిర్మాణ రంగంలో అడుగుపెట్టాయి. వీటన్నింటి దృష్ట్యా వచ్చే నాలుగైదేళ్లలో సివిల్‌ ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు వేల సంఖ్యలో ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అదే స్థాయిలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌కు సైతం డిమాండ్‌ ఉంది. ఆటో రిక్షా నుంచి బోయింగ్‌ విమానాల ఉత్పత్తి వరకు ప్రతి విభాగంలోనూ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ నైపుణ్యాలు కలిగిన వ్యక్తుల అవసరం. మేకి¯న్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా వంటి పథకాల నేపథ్యంలో ఇప్పటికి  దాదాపు లక్ష మంది మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పట్టభద్రుల అవసరం ఏర్పడనుందని పలు వర్గాల అంచనా.  

Also read: Top Business Management Certification...

నిపుణుల కొరత ఏర్పడే ప్రమాదం 
కోర్‌ బ్రాంచ్‌లు ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్‌ కోర్స్‌లు రద్దు చేయకూడదు. వాటి ఫలితంగా రాబోయే రోజుల్లో ఈ రంగంలో నిపుణుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. కోర్‌ బ్రాంచ్‌ల సిలబస్‌లో ప్రస్తుత కాలానికి అనుగుణంగా కొంత మార్పులు చేసుకుంటే, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
    – డాక్టర్‌ జ్యోతిలాల్‌ నాయక్‌ భరోతు ఇంజినీరింగ్‌ విద్యావేత్త 

Also read: The 7 Cs of Communication

కోర్‌ బ్రాంచ్‌లు ఎవర్‌గ్రీన్‌ 
కోర్‌ బ్రాంచ్‌లు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్, అభివృద్ధి అన్ని వైపుల నుంచి ఉండాలి. ఒకే వైపు వెళితే ప్రమాదం. ప్రస్తుతం విద్యుత్‌ ఉపకరణాల ప్రాధాన్యత పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఇంజినీర్లు కరవైతే ఇబ్బందే. భవిష్యత్‌లో కోర్‌ బ్రాంచ్‌లకు అత్యంత ప్రాధాన్యత సంతరిస్తుంది. ఏ బ్రాంచ్‌లోనూ పూర్తి స్థాయిలో సీట్లు ఎత్తివేయవద్దని ఏఐసీటీఈ పేర్కొంది. అందుకు అనుగుణంగా కళాశాలల యాజమాన్యాలకు ఆదేశాలు ఇస్తున్నాం.       – సీహెచ్‌ సాయిబాబు, 
    అకడమిక్‌ డైరెక్టర్, జేఎన్‌టీయూ 

కోర్సుల రద్దు అనుమతించొద్దు 
సంప్రదాయ కోర్సుల రద్దుకు యూనివర్సిటీ అనుమతించకూడదు. కంప్యూటర్‌ కోర్సులు చేసిన వారందరికీ ఉపాధి లభిస్తుందనేది ఆవాస్తవం. కంప్యూటర్‌ సై¯న్స్‌  సీట్లు పెంచుకునేందుకు కళాశాలలు చేస్తున్న ప్రయత్నాలే ఇవి. డొనేషన్ల రూపంలో డబ్బులు వసూలు చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. కళాశాలల్లో ఆయా కోర్సులకు అవసరమైన కనీస సౌకర్యాలు కూడా కలి్పంచడం లేదు.  
 – ఎంవీ బ్రంహానందరెడ్డి, 
ఏపీటీపీఐఈఏ, రాష్ట్ర అధ్యక్షుడు  

Published date : 17 Jun 2022 04:50PM

Photo Stories