Artificial Intelligence: 5,6 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు
Sakshi Education
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ ఐటీలో ఏఐ–పవర్డ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ఫర్ సస్టైనబిలిటీ పేరుతో ఈ ఏడాది జూలై 5, 6 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నామని ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్ మార్చి 4న ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుత కాలంలో వివిధ రంగాలలో పెరుగుతున్న కృత్రిమ మేధస్సు ప్రాధాన్యం, తద్వారా పర్యావరణ, సామాజిక అభివృద్ధిలో దాని కీలకపాత్రను దృష్టిలో ఉంచుకుని ఈ సదస్సు నిర్వహించనున్నామన్నారు. రెండు రోజులపాటు జరగనున్న సదస్సు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో కృత్రిమ మేధస్సు మానవాళి మనుగడకు దోహదపడే అంశాలను చర్చించేందుకు ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
చదవండి: AI & Chat GPT: సరికొత్త సాంకేతిక సవాలు.. రాతపూర్వక సమాచారాన్ని వీడియోగా మార్చనున్న ‘సోరా’!!
విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు, పరిశోధనలకు విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి, ఇటీవల సాధించిన పురోగతులను చర్చించడానికి ఈ సదస్సు అంతర్జాతీయ వేదిక అవుతుందని పేర్కొన్నారు. ఈ సదస్సులో పాల్గొనదలచిన వారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జీఎంఆర్‌ఐటీ.ఈడీయు.ఐన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.
Published date : 05 Mar 2024 03:34PM