TSAFRC: ప్రభుత్వానికి ఇంజనీరింగ్ ఫీజుల ఫైల్
అయితే, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల కమిటీ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) వర్గాలు తెలిపాయి. జీవో విడుదల చేసిన తర్వాతే ఫీజుల పెంపు అమల్లోకి వస్తుంది. ఇదిలాఉంటే, మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయం ఆలస్యమయ్యే అవకాశముందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ఇదే క్రమంలో అక్టోబర్ 11 నుంచి రెండోదశ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. సీట్ల కేటాయింపు జరిగే అక్టోబర్ 16 వరకూ కూడా జీవోలు రావడంపై అనుమాలు వ్యక్తమవుతున్నాయి. రెండో దశ కౌన్సెలింగ్ వాయిదా వేస్తే తదుపరి కౌన్సెలింగ్‌లు మరింత ఆలస్యమవుతాయని సాంకేతిక విద్య విభాగం అధికారులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 11 నుంచే కౌన్సెలింగ్ చేపట్టి, 2019లో నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలని, ఒకవేళ ఫీజులు పెరిగినట్టు జీవోలు వస్తే తదుపరి వసూలు చేయాలనే యోచనలో అధికారులున్నారు.
చదవండి:
తగ్గాల్సిందే... తగ్గేదేలే.. ఎఫ్‌ఆర్‌సీ ఎదుట 20 కాలేజీల వాదన
Engineering: ఒక్కో విద్యార్థిపై సగటున ఏటా ఇన్ని వేల అదనపు భారం