Skip to main content

BCCI: బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ జీతం ఎంతో తెలుసా..? నూతన చైర్మన్‌ ఎవరంటే..

క్రికెట్‌ జట్టు సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ ను భారత క్రికెట్‌ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. సీనియర్ మెన్స్‌ జాతీయ జట్టు సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ గా మరోసారి చేతన్‌ శర్మను నియమిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది.
ChetanSharma

ప్యానెల్‌లో సభ్యులుగా శివ్‌ సుందర్‌ దాస్, సుబ్రోతో బెనెర్జీ, సలీల్‌ అంకోలా, శ్రీధరన్‌  శరత్‌ నియమితులయ్యారు. చేతన్‌ ను మరోసారి నియమిస్తారనే వార్తలు సోషల్‌ మీడియాలో వచ్చినప్పటికీ.. చీఫ్‌ సెలెక్టర్‌గా ఎంపిక చేస్తారని ఎవరూ ఊహించలేదు. 

చ‌ద‌వండి: 50 లక్షల ప్యాకేజీతో శభాష్‌ అనిపించుకున్న మధుర్‌... ఎలా సాధించాడో తెలుసా
గత టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో పది వికెట్ల తేడాతో భారత్‌ ఘోర పరాభవం చెందిన తర్వాత అప్పటి సెలెక్షన్‌ కమిటీపై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే కొత్త సెలెక్టర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దాదాపు 50 మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూలు నిర్వహించి సెలెక్టర్ల జాబితాను బీసీసీఐకి అప్పగించింది. బాధ్యతలు చేపట్టే చైర్మన్‌ కు ఏడాదికి రూ. 1.25 కోట్లు, సెలెక్టర్లకు రూ. కోటిను పారితోషికంగా బీసీసీఐ ఇవ్వనుంది.

Published date : 07 Jan 2023 07:08PM

Photo Stories