TS EAMCET 2023 Results Out : ఎంసెట్ ఫలితాలు విడుదల.. మొత్తం ఎంత మంది పాస్ అయ్యారంటే..
ఈ ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.TS EAMCET Results 2023 కోసం సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. జూన్ నెల ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్‌కు 195275 మంది హాజరయ్యారు. ఇలాగే అగ్రికల్చర్‌కు 106514 మంది విద్యార్థులు హాజరయ్యారు. స్థానికులకు 85 శాతం సీట్లను కల్పించారు. 15 శాతం సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు. ఈ పరీక్షలకు మొత్తం మీద 94.44 శాతం హాజరయ్యారు.
How to check TS EAMCET 2023 Results:
☛ Visit results.sakshieducation.com or sakshieducation.com
☛ Click on TS EAMCET 2023 Results link available on the home page
☛ In the next page, enter your hall ticket no. and click on submit
☛ The results will be displayed on the screen
☛ Save a copy of the marks sheet for further reference
☛ టీఎస్ ఎంసెట్ -2023 ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
ఈ సారి టీఎస్ ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ లేదు.. కానీ
మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్ష, మే 12 నుంచి 15వరకు ఆరు విడతల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఎంసెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్) ప్రాథమిక ‘కీ’ తో పాటు రెస్పాన్స్ షీట్లులను కూడా మే 14వ తేదీ విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ సారి టీఎస్ ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ లేదు. ఈ సారి విద్యార్థులకు ఎంసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులను ప్రకటిస్తారు.
ఈ సారి భారీగా..
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు కలిపి 3,20,310 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో తెలంగాణకు చెందినవి 2,48,146, ఏపీవి 72,164 ఉన్నాయి. గత సంవత్సరం (2022) మొత్తం 2,66,714 దరఖాస్తులే రావడం గమనార్హం. కాగా ఈ ఏడాది అనూహ్యంగా 53,224 దరఖాస్తులు (20%) పెరిగాయి.
మొత్తం ఎంత మంది పాస్ అయ్యారంటే..
ఇంజినీరింగ్‌లో 80 శాతం, అగ్రికల్చర్‌లో 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణలో 15 జోన్లు, ఏపీలో 6 జోన్లలో పరీక్ష నిర్వహించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అగ్రికల్చర్ స్ట్రీమ్ లో 1,10544 మంది పరీక్ష రాయగా.. 91,935 మంది విద్యార్థులు (86 శాతం) ఉత్తీర్ణులయ్యారని మంత్రి తెలిపారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 1,53,890 మంది తెలంగాణ విద్యార్థులు పరీక్ష రాశారని.. ఏపీ నుంచి 51,461 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. మొత్తం పరీక్ష రాసిన వారిలో 1,56,879 మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి తెలిపారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో బాలురు 79 శాతం ఉత్తీర్ణులు కాగా, 82 శాతం మంది అమ్మాయిలు పాసయ్యారని తెలిపారు. అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 84 శాతం మంది అబ్బాయిలు పాస్ కాగా.. అమ్మాయిలు 87 శాతం మంది పాసైనట్లు వెల్లడించారు.