Skip to main content

TS EAMCET-2022 Results Link : టీఎస్ ఎంసెట్ ఫ‌లితాల విడుద‌ల తేదీ ఇదే..? ఈ సారి రిజ‌ల్డ్స్‌ను..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TS EAMCET పరీక్ష జూలై 18, 19, 20 తేదీల్లో నిర్వహించిన విష‌యం తెల్సిందే.
TS EAMCET 2022 Results

ఈ ప‌రీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు మరో సెషన్‌లో జ‌రిగాయి. ఈ మూడు రోజులు జ‌రిగిన ప‌రీక్ష‌ల‌కు తెలంగాణ‌, ఏపీ నుంచి 91 శాతం మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ఈసారి సకాలంలోనే నిర్వహించిన‌ ఎంసెట్‌కు భారీగానే పోటీ నెలకొంది. ఈ సారి ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు 1,72,243 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోక‌.. ప‌రీక్ష‌కు మాత్రం 1,56,812 మంది హాజ‌ర‌య్యారు.  TS EAMCET Keyని కూడా విడుద‌ల చేశారు. 

How to check TS EAMCET 2022 Results:
☛ Visit results.sakshieducation.com or sakshieducation.com
☛ Click on TS EAMCET 2022 Results link available on the home page
☛ In the next page, enter your hall ticket no. and click on submit
☛ The results will be displayed on the screen
☛ Save a copy of the marks sheet for further reference

అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్‌కు..
అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్‌కు 94,150 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్‌కు ప‌రీక్ష‌లు మాత్రం జూలై 30, 31వ తేదీల్లో జ‌రిగిన విష‌యం తెల్సిందే. మొత్తంగా 2,66,445 దరఖాస్తులు ఎంసెట్ వ‌చ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 14,722 దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. రెండు రోజుల పాటు జ‌రిగిని 85.3 శాతం మంది విద్యార్థులు హాజరైనట్టు ఎంసెట్ కన్వీన‌ర్‌ ప్రొఫెసర్‌ గోవర్థన్‌ తెలిపారు. పరీక్షకు 80575 మంది హాజరయ్యారు. అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన కీ కూడా విడుద‌ల చేశారు. TS EAMCET Results 2022 ను ఆగ‌స్టు 12 లేదా 13వ తేదీల్లో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. TS EAMCET Results 2022 కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

టీఎస్ ఎంసెట్‌-2021 (ఇంజ‌నీరింగ్‌) కాలేజ్ & ర్యాంక్‌ ప్రిడిక్ట‌ర్ కోసం క్లిక్ చేయండి

EAMCET 2022 Rank Predictor: Check Expected Rank based on Marks

☛ చదవండి: బీటెక్‌లో ఈఈఈతో భవిష్యత్తుకు భరోసా ఉంటుందా.. తెలుసుకోండిలా..

☛ చదవండి: ఎవర్‌గ్రీన్ సివిల్ ఇంజనీరింగ్.. కెరీర్ అవకాశాలు ఇలా..

☛ చదవండి: ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో ఈ సాఫ్ట్‌వేర్ కోర్సులదే హవా..

☛   After Inter Jobs: ఇంటర్‌తోనే సాఫ్ట్‌వేర్‌ కొలువు

Published date : 11 Aug 2022 01:06PM

Photo Stories