Skip to main content

TS EAMCET 2023 Rank Predictor : టీఎస్ ఎంసెట్‌-2023 ప‌రీక్ష రాశారా..? అయితే మీకు వ‌చ్చే మార్కుల‌కు ఎంత ర్యాంక్ వ‌స్తుందంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్రవాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష TS EAMCET. మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్ అండ్‌ మెడికల్ పరీక్షను.. ఇక మే 12-14 మధ్య ఇంజినీరింగ్ పరీక్షలు జరిగిన విష‌యం తెల్సిందే.
TS EAMCET 2023 Marks Vs Expected Rank Details in Telugu
TS EAMCET 2023 Marks Vs Expected Rank

ఈ ప‌రీక్ష‌కు ఆంద్ర‌ప్ర‌దేశ్ విద్యార్థులు కూడా హాజ‌ర‌య్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్. అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు.

Engineering college Admissions : ఇంజ‌నీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?

అలాగే TS EAMCET లో వ‌చ్చే ర్యాంక్‌ల‌పై విద్యార్థుల‌తో పాటు.. వీరి తల్లిదండ్రులు ఎంతో  ఆస‌క్తి ఉంటుంది. ఎందుకంటే ఈ ర్యాంక్‌ల ఆధారంగానే టాప్ ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో ప్ర‌వేశాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

గత సంవత్సరం కంటే.. ఈ సారి భారీగా ద‌ర‌ఖాస్తులు..

ts eamcet  applications details 2023 telugu news

ఈసారి టీఎస్ ఎంసెట్‌కు  భారీగా దరఖాస్తులొచ్చాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్‌లో నూ ఇదే ట్రెండ్‌ కన్పిస్తోంది. రెండు విభాగాలకు కలిపి 3,20,310 మందికి పైగా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇందులో తెలంగాణకు చెందినవి 2,48,146, ఏపీవి 72,164 ఉన్నాయి. గత సంవత్సరం (2022) మొత్తం 2,66,714 దరఖాస్తులే రావడం గమనార్హం. కాగా ఈ ఏడాది అనూ హ్యంగా 53,224 దరఖాస్తులు (20%) పెరిగాయి. 

TS EAMCET 2023లో మీకు వ‌చ్చిన మార్కుల‌కు.. ఎంత ర్యాంక్ వ‌చ్చే అవ‌కాశం ఉందంటే..?
ఇప్ప‌టికే చాలా మంది విద్యార్థులు.., TS EAMCET-2023 ప‌రీక్ష రాసిన వారు ఎన్ని మార్కులు వచ్చే అవ‌కాశం ఉందో ఒక అంచ‌నాకు వ‌చ్చి ఉంటారు. ఈ నేపథ్యంలో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) మీకోసం ప్ర‌త్యేకం మీకు వ‌చ్చిన మార్కుల ఆధారంగా.., మీకు ఎంత ర్యాంక్ వ‌స్తుందో.. ఒక అంచనా కోసం కింది విధంగా అందిస్తోంది. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే.. అంతిమంగా ప్ర‌భుత్వం అధికారికంగా  విడుద‌ల చేసే ఫ‌లితాల ఆధారంగానే మీ సీట్ల కేటాయింపు ఉంటుంది.

TS EAMCET 2023లో మీకు వ‌చ్చిన మార్కుల‌కు.. ర్యాంక్ ఇలా..

Expected Rank

TS EAMCET Marks
1 to 50 160 to155
51 to 200 154 to 150
201 to 500 149 to 140
501 to 1000 139 to 130
1001 to 2000 129 to 120
2001 to 4000 119 to 110
4001 to 6000 109 to 100
6001 to 10000 99 to 90
10001 to 15000 89 to 80
15001 to 25000 79 to 70
25001 to 40000 69 to 60
40001 to 50000 59 to 50
50001 to 80000 49 to 40
Above 80000 Below 40

టీఎస్ ఎంసెట్ ఫ‌లితాలు..

 

మే 26-30 మధ్య ఫలితాలు విడుదలను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీలైనంత త్వ‌ర‌గా ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ స్ట్రీమ్ టెస్ట్‌ల ప్రిలిమినరీ 'కీ'లపై విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాలను నిపుణుల బృందం పరిశీలిస్తుంది. 

Engineering‌ Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోస‌మే!

దీని తరువాత, తుది కీ రూపొందిస్తారు. మొత్తం ఐదు రోజుల పాటు పలు సెషన్ లలో నిర్వహించిన పరీక్షలు కాబట్టి ఫలితాల వెల్లడించడానికి కాస్త సమయం పడుతుంది. ఎంసెట్ ఫలితాలు మే 26 -30 తేదీల మధ్య ప్రకటించే అవకాశం ఉందని ఎంసెట్ నిర్వహణ వర్గాలు తెలిపాయి. .TS EAMCET Results 2023 కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

బీటెక్‌కు క్రేజ్‌ కూడా కారణం ఇదే..

ts eamcet 2023

జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి జేఈఈ రాయాల్సి ఉంటుంది. ఇందులో ర్యాంకు రావాలంటే బాగానే కష్టపడాలి. ముమ్మర కోచింగ్‌ తీసుకోవాలి. ఇంతా చేసి సాధారణ ర్యాంకు వస్తే కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో సీట్లు లభించడం కష్టం. ఈ కారణంగానే ఇంటర్‌ ఉత్తీర్ణుల్లో సగానికిపైగా జేఈఈ వైపు వెళ్ళడం లేదు. ఎలాగైనా కంప్యూటర్‌ సంబంధిత ఇంజనీరింగ్‌ కోర్సు చేయాలనుకుంటున్న వారు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎంసెట్‌కు 3 లక్షల మంది దరఖాస్తు చేస్తే, జేఈఈకి 1.40 లక్షల మందే దరఖాస్తు చేయడం గమనార్హం.

మరోవైపు విద్యార్థుల అభిమతానికి అనుగుణంగా రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీలు కూడా ట్రెండ్‌ మార్చాయి. సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రి కల్‌ విభాగాల్లో సీట్లు తగ్గించుకుంటున్నాయి. వీటి స్థానంలో సీఎస్‌సీ, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి కోర్సుల్లో సీట్లు పెంచుకుంటున్నాయి. దీంతో ఎంసెట్‌లో అర్హత సాధిస్తే ఏదో ఒక కాలేజీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు అనువైన కంప్యూటర్‌ కోర్సు సీటు వస్తుందని విద్యార్థులు భావిస్తున్నారు.ఎంసెట్‌కు దరఖాస్తులు పెరగడానికి ఇది కూడా ఒక కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

☛ TS EAMCET Preliminary Key 2023 : టీఎస్ ఎంసెట్ ‘కీ’ తో పాటు రెస్పాన్స్ షీట్లు విడుద‌ల‌.. అలాగే ఫ‌లితాల‌ను కూడా..

ఎంసెట్‌ కోసం మొత్తం 21 జోన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 16 జోన్లు తెలంగాణలో, 5 ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. తెలంగాణలో ఉన్న జోన్లలో ఐదు హైదరాబాద్‌ కేంద్రంగానే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,48,146 ఎంసెట్‌ దరఖాస్తులొస్తే, హైదరాబాద్‌ కేంద్రంగానే 1,71,300 అప్లికేషన్లు వచ్చాయి.

హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లోనే జూనియర్‌ కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి. కార్పొరేట్‌ కాలేజీల దృష్టీ ఇక్కడే ఉంటోంది. టెన్త్‌ పూర్తవ్వగానే ఇంటర్‌ విద్యాభ్యాసానికి, ఎంసెట్‌ శిక్షణకు హైదరాబాదే సరైన కేంద్రమని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ కారణంగానే పిల్లల్ని హాస్టళ్ళలో ఉంచి మరీ చదివిస్తున్నారు. ఫలితంగా హైదరాబాద్‌ కేంద్రంగానే ఎంసెట్‌ రాసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.

Published date : 18 May 2023 05:41PM

Photo Stories