TS EAMCET 2023: టాపర్స్‌గా అబ్బాయిలు... టోటల్‌గా అమ్మాయిలు!.. ఫలితాల తీరు ఇదీ..
మొత్తంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో 80 శాతం.. అగ్రి, మెడికల్ స్ట్రీమ్‌లో 86 శాతం మంది అర్హత సాధించారు. ఇక ర్యాంకులు తెలంగాణ విద్యార్థులకన్నా.. ఏపీకి చెందినవారికే ఎక్కు వగా వచ్చాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశానికి ఉన్నత విద్యా మండలి, జేఎన్‌టీయూహెచ్ నేతృత్వంలో మే 10 నుంచి 14 వరకు ఎంసెట్ పరీక్షను నిర్వహించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మే 25న విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, జేఎన్‌టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి, ఎంసెట్ కన్వీనర్ డీన్‌కుమార్‌లు పాల్గొన్నారు.
》TS EAMCET Results - 2023 - Engineering | Agri./Medical
భారీగా దరఖాస్తులు
రాష్ట్ర ఎంసెట్‌కు ఈసారి దరఖాస్తులు భారీగా పెరిగాయి. నర్సింగ్ సీట్ల భర్తీ కూడా ఎంసెట్ ర్యాంకు ద్వారానే చేపట్టడంతో డిమాండ్ వచ్చింది. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు మొత్తం 2,05,351 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,95,275 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,56,879 (80.33 శాతం) మంది అర్హత సాధించారు. అగ్రి, మెడికల్ స్ట్రీమ్‌కు 1,15,332 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,06,514 మంది పరీక్ష రాశారు. ఇందులో 91,935 మంది (86.31 శాతం) అర్హత సాధించారు. అగ్రి, మెడికల్ స్ట్రీమ్‌లో 155.008732 మార్కులతో బూరుగుపల్లి సత్యరాజ జశ్వంత్.. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో సంగపల్లి అనిరుధ్ 158.899780 మార్కులతో టాపర్లుగా నిలిచారు.
》College Predictor - 2023 - TS EAMCET | AP EAPCET
మూడు మార్కులు కలిపి..
ఈసారి ఎంసెట్ ఇంజనీరింగ్ విద్యార్థులకు మూడు మార్కులు అదనంగా కలిపారు. మొత్తంగా 6 సెషన్లుగా పరీక్షలను నిర్వహించగా.. 5వ, 6వ సెషన్లలో గణితంలో ఇచ్చిన పలు ప్రశ్నలకు సమాధానాలు సరితూకగపోవడం, స్పష్టత లోపించడంతో ఈ మార్కులు కలిపారు. నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా కూడా పలు సెషన్లలో కఠినంగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలిపినట్టు తెలిసింది.
సకాలంలో సమర్థవంతంగా నిర్వహించాం: సబితా ఇంద్రారెడ్డి
ఎంసెట్‌ను సమర్థవంతంగా నిర్వహించామని, దీనిపై సంబంధిత విభాగాలకు, విద్యాశాఖ అధికారులకు అభినందనలు తెలుపుతున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఉత్తమ ర్యాంకులు సాధించినవారిని మంత్రి అభినందించారు. రెండు, మూడు రోజుల్లోనే ప్రవేశాల షెడ్యూల్‌ను విడుదల చేయాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు.
ఎంసెట్ ఫలితాల తీరు ఇదీ..
|
ఇంజనీరింగ్ |
అగ్రికల్చర్ అండ్ మెడికల్ |
||
అబ్బాయిలు |
అమ్మాయిలు |
అబ్బాయిలు |
అమ్మాయిలు |
|
దరఖాస్తులు |
1,24,679 |
80,672 |
34,127 |
81,205 |
హాజరైనవారు |
1,18,739 |
76,536 |
31,633 |
74,881 |
క్వాలిఫై అయింది |
94,065 |
62,814 |
26,772 |
65,163 |
అర్హత శాతం |
79.21 |
82.07 |
84.63 |
87.02 |
సామాజిక వర్గాల వారీగా క్వాలిఫై అయినవారు (ఇంజనీరింగ్‌లో)
కేటగిరీ |
తెలంగాణ వారు |
ఏపీవారు |
మొత్తం (శాతం) |
బీసీ–ఏ |
7,470 |
3,547 |
11,017 (72.99) |
బీసీ–బీ |
23,711 |
5,132 |
28,843 (75.53) |
బీసీ–సీ |
552 |
208 |
760 (75.39) |
బీసీ–డీ |
20,706 |
7,088 |
27,794 (74.30) |
బీసీ–ఈ |
5,824 |
1,480 |
7,304 (71.06) |
ఓసీ |
32,268 |
18,119 |
50,387 (80.57) |
ఎస్సీ |
16,370 |
3,262 |
19,632 (100) |
ఎస్టీ |
10,426 |
716 |
11,142 (100) |
మొత్తం |
1,17,327 |
39,552 |
1,56,879 (80.33) |
సామాజికవర్గాల వారీగా క్వాలిఫై అయినవారు (అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో)
కేటగిరీ |
తెలంగాణవారు |
ఏపీవారు |
మొత్తం (శాతం) |
బీసీ–ఏ |
4,313 |
1,870 |
6,183 (76.39) |
బీసీ–బీ |
11,171 |
2,197 |
13,368 (78.77) |
బీసీ–సీ |
486 |
207 |
693 (84.20) |
బీసీ–డీ |
11,648 |
2,749 |
14,397 (75.08) |
బీసీ–ఈ |
8,232 |
908 |
9,140 (81.13) |
ఓసీ |
9,531 |
4,224 |
13,755 (87.11) |
ఎస్సీ |
18,976 |
3,577 |
22,553 (100) |
ఎస్టీ |
11,070 |
776 |
11,846 (100) |
మొత్తం |
75,427 |
16,508 |
91,935 (86.31) |