Skip to main content

TS EAMCET 2022 Notification: ఎంసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఫీజు వివ‌రాలు ఇవే..

తెలంగాణ ఎంసెట్ - 2022 నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఈ నోటిఫికేష‌న్‌ ద్వారా ఇంట‌ర్ త‌ర్వాత‌ ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్‌, మెడిక‌ల్ కోర్సులో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు.
TS EAMCET 2022
TS EAMCET 2022 Notification

ఈ ప‌రీక్ష‌ను జేఎన్‌టీయూహెచ్‌ నిర్వహిస్తుంది. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. వ్యవసాయ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్‌ జూలై 14, 15 తేదీల్లో, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరేందుకు చేపట్టే ఎంసెట్‌ పరీక్ష జూలై 18, 19, 20 తేదీల్లో జ‌ర‌గ‌నున్న‌ది. మొత్తం 23 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 105 పరీక్ష కేంద్రాలను ఈ సెట్స్‌ కోసం ఏర్పాటు చేస్తున్నారు.

టీఎస్ ఎంసెట్ స్ట‌డీమెటీరియ‌ర్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

ఫీజు వివ‌రాలు ఇవే..
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులు రూ. 400, మిగ‌తా కేట‌గిరిల అభ్య‌ర్థులు రూ. 800 చెల్లించారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఇంజినీరింగ్, మెడిక‌ల్ ప్ర‌వేశ ప‌రీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులు రూ. 800, మిగ‌తా కేట‌గిరిల అభ్య‌ర్థులు రూ. 1600 చెల్లించి, ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని నోటిఫికేష‌న్‌లో వెల్ల‌డించారు.

ఇంటర్‌ వెయిటేజీ లేదు..

Inter


ఇంటర్మీడియెట్‌ మార్కులను ఎంసెట్‌లో వెయిటేజ్‌గా తీసుకోవడం లేదని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి స్పష్టంచేశారు. కరోనా నేపథ్యంలో గతేడాది కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎంసెట్‌ రాసే ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులు గత ఏడాది ఆఖరులో జరిగిన ఇంటర్‌ ఫస్టియర్‌లో కేవలం 49 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం అందరినీ కనీస మార్కులతో పాస్‌ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీని తొలగించాల్సి వచి్చందని అధికారులు తెలిపారు. 

సత్తా చాటేలా.. ప్రిపరేషన్ సాగించండిలా..

సెప్టెంబర్‌లో కౌన్సెలింగ్ ఉండే అవ‌కాశం..!

EAMCET Counselling


వాస్తవానికి ఎంసెట్‌ను జూన్ లోనే నిర్వహించాలని తొలుత భావించారు. అనూహ్యంగా జేఈఈ మెయిన్స్‌ పరీక్షల తేదీల్లో మార్పులు చేయడంతో ఎంసెట్‌ను ఆలస్యంగా చేపట్టాల్సి వస్తోందని ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టులో జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీలు, ఐఐటీల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాతే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ చేపట్టడం సరైన నిర్ణయంగా భావించినట్టు చెప్పాయి. ఈ విధానం వల్ల సీట్ల లభ్యతపై స్పష్టత ఉంటుందని, గత ఏడాది కూడా ఇలాగే చేసినట్టు ఎంసెట్‌ నిర్వహణ విభాగం పేర్కొంది.

చదవండి: మోడల్ పేపర్లు | ప్రివియస్‌ పేపర్స్ | ప్రాక్టీస్ ప్రశ్నలు

College Predictor 2021 - TS EAMCET | AP EAPCET

 

 

Published date : 28 Mar 2022 07:58PM
PDF

Photo Stories