Skip to main content

EAMCET: అంత కష్టమేం కాదు: మాజీ చైర్మన్

కొత్త సీట్లు వచ్చాయి.. ఫస్ట్‌ కౌన్సెలింగ్‌లో కేటాయించిన సీట్లు ఖాళీ అవుతున్నాయి.. రెండో కౌన్సెలింగ్‌లో కోరుకున్న కాలేజీలో, కోరుకున్న సీటు గ్యారెంటీ అని చాలామంది విద్యార్థులు భావిస్తుంటారు.
అంత కష్టమేం కాదు: మాజీ చైర్మన్
అంత కష్టమేం కాదు: మాజీ చైర్మన్

అయితే ఈ కౌన్సెలింగ్‌ను అంత తేలికగా తీసుకోవద్దని సాంకేతిక విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. మొదటి కౌన్సెలింగ్‌ కన్నా, ఈ సారి మరింత ఎక్సర్‌సైజ్‌ చేయాలని సూచిస్తున్నారు. కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొంటున్నారు. కాగా, నవంబర్‌ 6 నుంచి రెండో దశ కౌన్సెలింగ్‌ మొదలవుతుంది. నవంబర్‌ 9వ తేదీ వరకు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కోర్సుకు ప్రాధాన్యమా..? కాలేజీకా అన్న విషయంపై క్లారిటీ తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. దీంతోపాటు మార్కెట్‌ ట్రెండ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటున్నారు.

అంత కష్టమేం కాదు

‘రెండో కౌన్సెలింగ్‌పై కాస్త కసరత్తు చేస్తే మంచి కాలేజీలో సీటు పొందే వీలుంది. ఆప్షన్స్ ఎంచుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అభిరుచే కాదు.. మార్కెట్‌ ట్రెండ్‌కు అనుగుణంగా బ్రాంచ్‌ ఎంచుకోవాలి. కోరుకున్న స్థాయిలో ర్యాంకు లేనప్పుడు మాత్రమే రెండో ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాలి. మొదటి కౌన్సెలింగ్‌ కన్నా రెండో కౌన్సెలింగే కీలకమని గుర్తించాలి.
–తుమ్మల పాపిరెడ్డి, తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్

చదవండి:

EAMCET: కౌన్సెలింగ్‌లో వీటిని పరిశీలించాలి

EAMCET: ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ తేదీలు ఖరారు

TS EAMCET 2021: కొత్త సీట్ల విషయంలో జాగ్రత్త

MBBS: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్ల వివరాలు

AP EAPCET: ఇంజనీరింగ్, ఫార్మసీలో సీట్లు వివరాలు

Published date : 05 Nov 2021 02:50PM

Photo Stories