Skip to main content

MBBS: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్ల వివరాలు

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లో మొత్తం 5,115 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.
MBBS Seats
ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్ల వివరాలు

10 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 1,765 సీట్లు ఉండగా, 23 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు, మైనారిటీ కాలేజీల్లో 3,350 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయని విశ్వవిద్యాలయం ప్రకటించింది. నవంబర్‌ 1న నీట్‌ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలో సీట్లపై స్పష్టత వచి్చంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్ టీఏ) నుంచి నీట్‌లో అర్హత సాధించిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల వివరాల డేటా రాగానే అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీచేస్తామని విశ్వవిద్యాలయం వెల్లడించింది. వారంలో ‘నీట్‌’రాష్ట్రస్థాయి ర్యాంకుల ప్రకటన వెలువడుతుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి.

ఆందోళన చెందొద్దు..

రాష్ట్రంలో చాలామంది జాతీయస్థాయిలో వేలల్లో వచి్చన ర్యాంకులను చూసి ఆందోళన చెందుతున్నారు. అయితే రాష్ట్ర స్థాయిలో చూస్తే ర్యాంకు తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జాతీయస్థాయిలో 90 వేల లోపు ర్యాంకులు వచి్చన విద్యార్థులకు రాష్ట్రంలో కనీ్వనర్‌ కోటాలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. జాతీయ స్థాయిలో లక్షపైన ర్యాంకులు వచి్చన వారికి మన దగ్గర ప్రైవేటు కాలేజీల్లోనూ ఎంబీబీఎస్‌ సీటు వస్తుందంటున్నారు. రాష్ట్ర స్థాయి ర్యాంకుల ప్రకటన అనంతరం త్వరలో మొదటి విడత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ జారీ చేస్తామని హెల్త్‌ వర్సిటీ వర్గాలు తెలిపాయి. అయితే తరగతులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై ఇంకా షెడ్యూల్‌ రాలేదని చెప్పాయి.

అఖిల భారత కోటాకు 15 శాతం సీట్లు..

ఈసారి వైద్య విద్యా సంవత్సరం కరోనా కారణంగా నెలల పాటు వాయిదా పడింది. ఈసారి తరగతులు ఎప్పుడు ప్రారంభం అవుతాయన్న దానిపై స్పష్టత రాలేదు. ప్రభుత్వ కాలేజీల్లోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లు కనీ్వనర్‌ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని సీట్లలో 15 శాతం సీట్లు అఖిల భారత కోటా కిందకు వస్తాయి. వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్‌ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని మన రాష్ట్రానికే ఇస్తారు. మరోవైపు కేంద్రం అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు సీట్ల కేటాయింపు జరిగింది. ఆలిండియా కోటాలో సీట్లు వచి్చనా కరోనా నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్తారో లేదోనన్న అనుమానాలను విశ్వ విద్యాలయం వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్ల వివరాలు

మెడికల్‌ కాలేజీ పేరు

సీట్లు

ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, హైదరాబాద్‌

250

గాంధీ మెడికల్‌ కాలేజీ, హైదరాబాద్‌

250

కాకతీయ మెడికల్‌ కాలేజీ, వరంగల్‌

250

మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీ

175

నల్లగొండ మెడికల్‌ కాలేజీ

150

నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీ

120

సిద్దిపేట మెడికల్‌ కాలేజీ

175

సూర్యాపేట మెడికల్‌ కాలేజీ

150

రాజీవ్‌గాంధీ మెడికల్‌ కాలేజీ, ఆదిలాబాద్‌

120

ఈఎస్‌ఐసీ, హైదరాబాద్‌

125

మొత్తం

1,765

చదవండి:

EAMCET: అంత కష్టమేం కాదు: మాజీ చైర్మన్

AP EAPCET: ఇంజనీరింగ్, ఫార్మసీలో సీట్లు వివరాలు

NEET Results: నీట్‌ ఫలితాలు, కటాఫ్ సమాచారం
Published date : 05 Nov 2021 01:59PM

Photo Stories