Skip to main content

AP EAPCET 2022: ఈఏపీసెట్‌కు భారీగా దరఖాస్తులు

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీఈఏపీ సెట్‌–2022కు పది రోజుల్లో 36 వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
AP EAPCET 2022
ఈఏపీసెట్‌కు భారీగా దరఖాస్తులు

ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మే 10 వరకు దరఖా స్తు చేసుకునేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఉన్నత విద్యా మండలి గడువిచ్చింది. ఏప్రిల్‌ 20 నాటికి 36,977 మంది ప్రవేశ పరీక్షకు ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 34,716 మంది ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించారని ఉన్నత విద్యా మండలి వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌ 20న 5,719 మంది రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించగా 5,521 మంది దరఖాస్తులు సమర్పించారు. కాగా, ఏపీ ఈఏపీసెట్‌ అభ్యర్థుల ర్యాంకుల్లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది. 2020 వర కు ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ విధానాన్ని అమలు చేశారు. ఇంటర్‌లో వచ్చిన మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి సెట్‌లో వచ్చిన మార్కులతో కలిపి ర్యాంకులు ప్రకటించేవారు. కరోనా వల్ల తరగతులు, పరీక్షల నిర్వహణ సరిగ్గా లేకపోవడం తదితర కారణాలతో 2021లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసింది.

చదవండి:

ఎంసెట్ స్ట‌డీమెటీరియ‌ర్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

ఎంసెట్: మోడల్ పేపర్లు | ప్రివియస్‌ పేపర్స్ | ప్రాక్టీస్ ప్రశ్నలు

నెలాఖరుకు ఈసెట్‌ నోటిఫికేషన్

డిపొ్లమో పూర్తిచేసిన అభ్యర్థులు లేటరల్‌ ఎంట్రీగా ఇంజినీరింగ్‌ సెకండియర్‌లో ప్రవేశించేందుకు నిర్వహించే ఏపీ ఈసెట్‌ నోటిఫికేషన్ ఈ నెలాఖరున వెలువడనుంది. ఆ తదుపరి వరుసగా ఇతర సెట్ల నోటిఫికేషన్లు కూడా విడుదల కానున్నాయి.

Published date : 21 Apr 2022 03:14PM

Photo Stories