AP EAMCET 2022 Rank Predictor : మీరు ఏపీ ఎంసెట్-2022 పరీక్ష రాశారా..? అయితే మీకు వచ్చే మార్కులకు ఎంత ర్యాంక్ వస్తుందో తెలుసా..?
ఈ పరీక్షకు తెలంగాణ విద్యార్థులు కూడా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్. అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. అలాగే AP EAMCETలో వచ్చే ర్యాంక్‌లపై విద్యార్థులతో పాటు.. వీరి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఈ ర్యాంక్‌ల ఆధారంగానే టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు వచ్చే అవకాశం ఉంది. ఏపీ ఈఏపీసెట్–2022 ఫలితాలు మాత్రం జూలై 3 లేదా 4వ వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.
ఏపీ ఎంసెట్-2021 (ఇంజనీరింగ్) కాలేజ్ & ర్యాంక్ ప్రిడిక్టర్ కోసం క్లిక్ చేయండి
ఏపీ ఎంసెట్-2022 కొశ్చన్ పేపర్ & 'కీ' కోసం క్లిక్ చేయండి
EAMCET 2022 Rank Predictor: Check Expected Rank based on Marks
ఈ సారి భారీగా 3,00,084 మంది..
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏపీ ఈఏపీసెట్‌కు 3,00,084 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల కోసం ఏపీలో 120, తెలంగాణలో 2 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ ఉండదు. సెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులకు ర్యాంకులు ప్రకటించనున్నారు. 2020లో 2.60 లక్షల మంది, 2021లో 2.73 లక్షల మంది దరఖాస్తు చేశారు. 2015–16 నుంచి జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసిన వారి సంఖ్యను పరిశీలిస్తే అత్యధికంగా 2016–17లో 2.85 లక్షల మంది దరఖాస్తు చేశారు. అంతకు మించి ఈసారి దరఖాస్తులు వెల్లువెత్తాయి.
టీఎస్ ఎంసెట్-2021 (ఇంజనీరింగ్) కాలేజ్ & ర్యాంక్ ప్రిడిక్టర్ కోసం క్లిక్ చేయండి
Engineering Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోసమే!
AP EAMCET 2022లో మీకు వచ్చిన మార్కులకు.. ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉందంటే..?
ఇప్పటికే చాలా మంది విద్యార్థులు.., AP EAMCET-2022 పరీక్ష రాసిన వారు ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉందో ఒక అంచనాకు వచ్చి ఉంటారు. ఈ నేపథ్యంలో సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) మీకోసం ప్రత్యేకం మీకు వచ్చిన మార్కుల ఆధారంగా.., మీకు ఎంత ర్యాంక్ వస్తుందో.. ఒక అంచనా కోసం కింది విధంగా అందిస్తోంది. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే.. అంతిమంగా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే ఫలితాల ఆధారంగానే మీ సీట్ల కేటాయింపు ఉంటుంది.
AP EAMCET 2021 (Engineering) College & Rank Predictor (Click Here)
TS EAMCET 2021 (Engineering) College & Rank Predictor (Click Here)
☛ చదవండి: బీటెక్‌లో ఈఈఈతో భవిష్యత్తుకు భరోసా ఉంటుందా.. తెలుసుకోండిలా..
☛ చదవండి: ఎవర్‌గ్రీన్ సివిల్ ఇంజనీరింగ్.. కెరీర్ అవకాశాలు ఇలా..
☛ చదవండి: ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో ఈ సాఫ్ట్‌వేర్ కోర్సులదే హవా..