Skip to main content

EAMCET: రెండో రోజు 90 శాతం హాజరు.. సమయం సరిపోలేదు..

ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి JNTUH నిర్వహిస్తున్న TS EAMCETకు జూలై 19న 90.4 శాతం మంది హాజరయ్యారు.
EAMCET
రెండో రోజు 90 శాతం హాజరు.. సమయం సరిపోలేదు..

రెండో రోజు కూడా ఆంధ్రప్రదేశ్‌లో నామమాత్రపు హాజరు నమోదైనట్టు EAMCET వర్గాలు తెలిపాయి. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తలేదని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు. రెండు రాష్ట్రాలు కలిపి మొత్తం 58376 మంది ఎంసెట్‌కు దరఖాస్తు చేశారు. వీరిలో 52,796 మంది పరీక్షకు హాజరయ్యారు. ఏపీలో 9371 మంది (79.7 శాతం), తెలంగాణలో 43,425 మంది (93.6 శాతం) పరీక్షకు హాజరయ్యారు. ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగం రెండో రోజు ప్రశ్నపత్రం కూడా తేలికగానే ఉందని విద్యార్థులు తెలిపారు. గణితం సుదీర్ఘ ప్రశ్నలతో ఉండటంతో జవాబులు రాయడానికి సమయం సరిపోలేదన్నారు. కెమెస్ట్రీ, ఫిజిక్స్‌ పేపర్ల నుంచి ఎక్కువ మార్కులు సాధించే వీలుందని నిపుణులు స్పష్టం చేశారు. 

చదవండి: 

Published date : 20 Jul 2022 03:19PM

Photo Stories