Skip to main content

Sabitha Indra Reddy: అర్హులైన టీచర్లకు మెసేజ్‌లు పంపండి

సాక్షి, హైదరాబాద్‌: టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను న్యాయస్థానం తీర్పుకు లోబడి నిర్వహించాలని మంత్రి సబిత ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
Sabitha Indra Reddy
అర్హులైన టీచర్లకు మెసేజ్‌లు పంపండి

 బదిలీకి అర్హత గల ప్రతి ఉపాధ్యాయుడికీ బదిలీల సమాచారం అందించాలని సూచించారు. ఈ మేరకు దరఖాస్తు చేసుకోవలసిందిగా ప్రతి ఒక్కరికీ మెసేజ్‌లు పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఆగస్టు 31న ఎస్సీఈఅర్టీ కార్యాలయంలో ఆమె అధికారులతో సమావేశమయ్యారు. పారదర్శకతతో ఎలాంటి అపోహలకు తావులేకుండా పదోన్నతులు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించారు.

చదవండి: Teachers Transfers and Promotions: నెల రోజుల్లోనే బదిలీలు, పదోన్నతులు.. వీరికి మాత్రం ప్రత్యేక ప్రాధాన్యమిస్తారు

వెంటనే సంబంధిత విధి విధానాలు రూపొందించాలని సూచించారు. ఆన్‌లైన్‌ ప్రక్రియలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బదిలీల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రస్థాయి అధికారులను జిల్లాల్లో పర్యవేక్షకులుగా నియమించాలని సూచించారు. సమావేశంలో పాఠశాల విద్యా సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు. 

పదోన్నతుల తర్వాత ఖాళీల భర్తీ 

పదోన్నతులు, ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) పూర్తయిన తర్వాత విద్యాశాఖలో ఉండే ఇతర ఖాళీలను భర్తీ చేస్తామని సమావేశానంతరం మంత్రి మీడియాకు తెలిపారు. టీచర్‌ పోస్టుల భర్తీకి కొంతమంది అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి: TS DSC Notification 2023: జిల్లాల వారీగా టీచర్‌ పోస్టులు ఇవీ.. అత్యధిక ఖాళీలు ఈ జిల్లాలోనే

ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ ఖాళీల్లో గెజిటెడ్‌ హెడ్‌ మాస్టర్, ప్రైమరీ స్కూల్‌ హెడ్‌ మాస్టర్‌ పోస్టులను, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, ఈ సమయంలో అన్ని పార్టీలు, అన్ని వర్గాలు సహకరించాలని మంత్రి కోరారు.

Published date : 01 Sep 2023 01:00PM

Photo Stories