Skip to main content

Naval Dockyard Recruitment 2024: నావల్‌ డాక్‌యార్డ్ లో 301 అప్రెంటిస్‌లు.. దరఖాస్తులకు చివరితేది ఇదే..

ముంబైలోని మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌(నేవీ), నేవల్‌ డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌ స్కూల్‌లో వివిధ ట్రేడు ల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Naval Dockyard Apprentice Recruitment 2024 Notification

మొత్తం ఖాళీల సంఖ్య: 301
ఖాళీల వివరాలు: ఏడాది అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌–288, రెండేళ్ల అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌–13.
ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లేటర్, ఫిట్టర్, ఫౌండ్రీ మ్యాన్, మెకానిక్‌(డీజిల్‌), ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, మెషినిస్ట్, ఎంఎంటీఎం, పెయింటర్‌(జి), ప్యాటర్న్‌ మేకర్, పైప్‌ ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, మెకానిక్‌ రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏసీ, షీట్‌ మెటల్‌ వర్కర్, షిప్‌ రైట్‌ (ఉడ్‌), టైలర్‌(జి), వెల్డర్‌(జి అండ్‌ ఇ), మేసన్‌ (బీసీ),ఐ అండ్‌ సీటీఎస్‌ఎం, షిప్‌ రైట్‌(స్టీల్‌), రిగ్గర్, ఫోర్జర్‌ అండ్‌ హీట్‌ ట్రీటర్‌.
అర్హత: ఎనిమిది, పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: కనిష్ట వయసు 14 ఏళ్లు, గరిష్ట వయోపరిమితి లేదు.
స్టైపెండ్‌: నెలకు రూ.6000 నుంచి రూ.7000.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ/స్కిల్‌ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.04.2024.

వెబ్‌సైట్‌: https://dasapprenticembi.recttindia.in/

చదవండి: SAIL Recruitment 2024: స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో 108 ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. వెంటనే అప్లై చేసుకోండిలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 29 Mar 2024 02:45PM

Photo Stories