Skip to main content

Indian Army Notification 2024: ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల..

ఇండియన్‌ ఆర్మీ 140 టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడెమీలో 2025లో ప్రారంభమయ్యే కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.
Indian Army TGC 140 Notification 2024 140 Technical Graduate Courses notification

మొత్తం పోస్టుల సంఖ్య: 30 (140వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు)
కోర్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌: సివిల్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజనీరింగ్‌ స్ట్రీమ్స్‌. 
అర్హతలు: సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులు లేదా కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
వయసు: 01.01.2025 నాటికి 20–27 ఏళ్ల మధ్య ఉండాలి.
 
ఎంపిక విధానం: అప్లికేషన్ల షార్ట్‌ లిస్టింగ్, స్టేజ్‌1, స్టేజ్‌ 2 టెస్టులు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి 12 నెలలపాటు డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడెమీలో శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో లెఫ్ట్‌నెంట్‌ ర్యాంకుతో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ లభిస్తుంది. శిక్షణ అనంతరం పర్మనెంట్‌ కమిషన్‌ ఇస్తారు.
 
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తులకు చివరి తేది: 09.05.2024

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/Authentication.aspx

చదవండి: SSC CHSL 2024 Notification: ఇంటర్ అర్హతతో 3,712 ఉద్యోగాలు.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 17 Apr 2024 05:44PM

Photo Stories