Woman Cricketer Rajashree Swain : మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వైన్ మృతి..
అథఘర్ ప్రాంతంలోని గురుడిఝాటియా అడవిలో చెట్టుకు వేలాడుతూ ఆమె మృతదేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.కాగా 26 ఏళ్ల రాజశ్రీ స్వైన్‌కు జనవరి 10న ప్రకటించిన ఒడిశా రాష్ట్ర మహిళల క్రికెట్ జట్టు తుది జాబితాలో చోటు దక్కలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఆ మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయింది. ఇక రాజశ్రీ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె కోచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆమె మృతదేహం అథఘర్ ఆడివిలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
Siddharth Sharma : భారత క్రికెట్‌లో విషాదం.. స్టార్ బౌలర్ మృతి
నేషనల్ టోర్నమెంట్‌కు..
త్వరలోనే పుదుచ్చేరిలో జరగనున్న జాతీయ స్థాయి టోర్నమెంట్ కోసం ఒడిశా క్రికెట్ సంఘం (ఓసీఏ) బజ్రకబటి ప్రాంతంలో ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించింది. రాజశ్రీతో పాటు 25 మంది ఎంపికయ్యారు. వాళ్లంతా అక్కడే ఒక హోటల్‌లో ఉంటున్నారు’ అని రాజశ్రీ కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. జనవరి 10న నేషనల్ టోర్నమెంట్‌కు ఎంపికైన వాళ్ల పేర్లను ఓసీఏ ప్రకటించింది. ఆ జాబితాలో రాజశ్రీ పేరు లేదు. దాంతో మనోవేదనకు గురైన ఆమె అదృశ్యం అయినట్టు తెలుస్తోంది.