Skip to main content

Suresh Raina : అన్ని ఫార్మాట్‌ల నుంచి.. సురేష్‌ రైనా క్రికెట్‌కు రిటైర్మెంట్.. రికార్డులు ఇవే..

టీమిండియా మాజీ ఆటగాడు సురేష్‌ రైనా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల క్రికెట్‌ నుంచి తప్పుకోనున్నట్లు సెప్టెంబ‌ర్ 6వ తేదీ (మంగళవారం) సోషల్‌మీడియా వేదికగా రైనా ప్రకటించాడు.
Suresh Raina

భారత్‌కు, నా రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ రోజు నేను అన్ని ఫార్మాట్‌ల నుంచి  క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. అదే విధంగా నా కెరీర్‌లో మద్దతుగా నిలిచిన బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌, సీఎస్‌కే, నా అభిమానులకు ధన్యవాదాలు అంటూ రైనా ట్విటర్‌లో పేర్కొన్నాడు.

ICC : రానున్న ఐదేళ్లలో భారత పురుషుల క్రికెట్‌ జట్టు షెడ్యూల్‌ ఇదే..

2020లోనే..
2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రైనా.. ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతూ వచ్చాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో పాల్గొన్న రైనాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిస్టర్‌ ఐపీఎల్‌ మిగిలిపోయాడు.

రైనా రికార్డులు ఇవే..

Suresh Raina


కాగా విదేశీ టీ20 లీగ్‌లలో ఆడేందుకు రైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విదేశీ టోర్నీలో ఆడాలంటే బీసీసీఐ నిర్వహించే అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌ నుంచి తప్పుకోవాలి. ఇక ఐపీఎల్‌లో11 సీజన్‌లలో చెన్నైసూపర్‌ కింగ్స్‌కు రైనా ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లు ఆడిన రైనా.. 5528 పరుగులు సాధించాడు. ఇక 18 టెస్టులు,226 వన్డేలు,78 టీ20ల్లో భారత్‌ తరపున మిస్టర్‌ ఐపీఎల్‌ ప్రాతినిథ్యం వహించాడు.

Published date : 06 Sep 2022 01:57PM

Photo Stories