China Masters Super 750: చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ టోర్నీలో రన్నరప్‌గా సాత్విక్–చిరాగ్ ద్వయం
Sakshi Education
ఆదివారం ముగిసిన చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సాత్విక్–చిరాగ్ ద్వయం రన్నరప్‌గా నిలిచింది.
Satwik Chirag finish as runners-up in China Masters final
71 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ 19–21, 21–18, 19–21తో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది.
విజేతగా నిలిచిన లియాంగ్–వాంగ్ చాంగ్‌లకు 85,100 డాలర్ల (రూ.70 లక్షల 92 వేలు) ప్రైజ్‌మనీ, 11 వేల ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సాత్విక్–చిరాగ్‌లకు 40,250 డాలర్ల (రూ. 33 లక్షల 54 వేలు) ప్రైజ్‌మనీ, 9350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.