ఒలింపిక్స్ చరిత్రలో పతకం గెలిచిన అతి చిన్న దేశం?
టోక్యో ఒలింపిక్స్–2020లో భాగంగా నిర్వహించిన మహిళల షూటింగ్ ఈవెంట్‌లో సాన్ మరినో దేశానికి చెందిన షూటర్ అలెజాండ్రా పెరిలి కాంస్య పతకం సాధించింది. దీంతో ఒలింపిక్స్ చరిత్రలో పతకం సాధించిన అతి తక్కువ జనాభా గల దేశంగా సాన్ మరినో రికార్డులకెక్కింది. 2021, జూలై 30న జరిగిన షూటింగ్ మహిళల ట్రాప్ ఈవెంట్ ఫైనల్లో... 33 ఏళ్ల పెరిలి 29 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్‌లో స్లొవేకియా అమ్మాయి స్టెఫెస్‌కొవా (43 పాయింట్లు) బంగారం గెలిస్తే... కైల్ బ్రౌనింగ్ (అమెరికా–42 పాయింట్లు) రజతం నెగ్గింది.
జనాభా 34 వేలు మాత్రమే...
సాన్ మరినో ఓ యూరోపియన్ యూనియన్ దేశం. సాన్ మరినో చుట్టూ ఇటలీ ఉంటుంది. జనాభా కేవలం 34 వేలు మాత్రమే! 60 ఏళ్ల క్రితం నుంచే రోమ్ ఒలింపిక్స్ (1960) నుంచి విశ్వక్రీడలు ఆడటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఓ పతకం సాధించింది. దీంతో పతకం సాధించిన అతి తక్కువ జనాభా గల దేశంగా రికార్డులకెక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఒలింపిక్స్ చరిత్రలో పతకం గెలిచిన అతి చిన్న దేశం?
ఎప్పుడు : జూలై 30
ఎవరు : సాన్ మరినో
ఎక్కడ : టోక్యో, జపాన్
ఎందుకు : టోక్యో ఒలింపిక్స్–2020 మహిళల షూటింగ్ ఈవెంట్‌లో సాన్ మరినో దేశానికి చెందిన షూటర్ అలెజాండ్రా పెరిలి కాంస్య పతకం సాధించడంతో...