Cricket: మహిళల టి20 క్రికెట్ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు?
దేశవాళీ మహిళల జాతీయ సీనియర్ టి20 క్రికెట్ టోర్నమెంట్–2022లో ఇండియన్ రైల్వేస్ జట్టు విజేతగా నిలిచింది. భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన సారథ్యంలోని మహారాష్ట్ర జట్టుతో మే 04న గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన ఫైనల్లో స్నేహ్ రాణా కెప్టెన్సీలోని ఇండియన్ రైల్వేస్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రైల్వేస్ జట్టు ఈ టైటిల్‌ను సాధించడం ఇది పదోసారి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మహారాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 160 పరుగులు చేసింది. అనంతరం రైల్వేస్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి విజయం సాధించింది.
GK Economy Quiz: బ్రిక్‌వర్క్స్ రేటింగ్స్ ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP వృద్ధి రేటు అంచనా?
Weightlifting: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన క్రీడాకారిణి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశవాళీ మహిళల జాతీయ సీనియర్ టి20 క్రికెట్ టోర్నమెంట్–2022లో విజేతగా నిలిచిన జట్టు?
ఎప్పుడు : మే 04
ఎవరు : రెల్వేస్ జట్టు
ఎక్కడ : సూరత్, గుజరాత్
ఎందుకు : ఫైనల్లో స్నేహ్ రాణా కెప్టెన్సీలోని ఇండియన్ రైల్వేస్ జట్టు ఏడు వికెట్ల తేడాతో భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన సారథ్యంలోని మహారాష్ట్ర జట్టుపై విజయం సాధించినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్