Weightlifting: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన క్రీడాకారిణి?
గ్రీస్‌లోని హెరాక్లియోన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్–2022లో మే 3న భారత అమ్మాయిలు రెండు పతకాలు గెలిచారు. మహిళల 49 కేజీల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్ రజతం... వి.రితిక కాంస్య పతకం సాధించారు. ఈ మెగా ఈవెంట్‌లో చత్తీస్‌గఢ్‌కు చెందిన 19 ఏళ్ల జ్ఞానేశ్వరి మొత్తం 156 కేజీలు (స్నాచ్‌లో 73+క్లీన్ అండ్ జెర్క్‌లో 83) బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. 18 ఏళ్ల రితిక 150 కేజీలు (స్నాచ్‌లో 69+క్లీన్ అండ్ జెర్క్‌లో 81) బరువెత్తి మూడో స్థానాన్ని సంపాదించింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, ఇండోనేసియాకు చెందిన విండీ కంతిక ఐసా 185 కేజీలు (స్నాచ్‌లో 83+క్లీన్ అండ్ జెర్క్‌లో 102) బరువెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
GK National Quiz: తెలంగాణలో పరీక్షించిన భారతదేశపు ఆటోమేటిక్ రైలు ఢీకొనే రక్షణ వ్యవస్థ పేరు?
చైనా, ఉత్తర కొరియా, థాయ్‌లాండ్, రొమేనియా, బల్గేరియా తదితర దేశాలు ఈ టోర్నీకి దూరంగా ఉండగా... ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాను, రష్యాకు సహచరిస్తున్న బెలారస్‌ను ఈ మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగకుండా అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య నిషేధం విధించింది.Chess: చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్న ఆటగాడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్–2022లో భారత్‌కు రెండు పతకాలు
ఎప్పుడు : మే 03
ఎవరు : జ్ఞానేశ్వరి యాదవ్(రజతం), వి.రితిక(కాంస్యం)
ఎక్కడ : హెరాక్లియోన్, గ్రీస్
ఎందుకు : మహిళల 49 కేజీల విభాగంలో జ్ఞానేశ్వరి మొత్తం 156 కేజీలు (స్నాచ్‌లో 73+క్లీన్ అండ్ జెర్క్‌లో 83) బరువెత్తి రెండో స్థానం, రితిక 150 కేజీలు (స్నాచ్‌లో 69+క్లీన్ అండ్ జెర్క్‌లో 81) బరువెత్తి మూడో స్థానాన్ని సంపాదించినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్