కరెంట్ అఫైర్స్ (జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 05-11 March, 2022)
1. 121 ఛార్జింగ్ పాయింట్లతో 4 చక్రాల వాహనాల కోసం భారతదేశంలో అతిపెద్ద EV ఛార్జింగ్ స్టేషన్ ఏ నగరంలో ప్రారంభమైంది?
ఎ. చెన్నై
బి. పూణే
సి. గురుగ్రామ్
డి. న్యూఢిల్లీ
- View Answer
- Answer: సి
2. 'ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (PMBJP)' పథకం లక్ష్యం?
ఎ. జనాభాలోని అన్ని వర్గాల వారికి ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాలకు నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవడం.
బి. విద్య, ప్రచారం ద్వారా జనరిక్ ఔషధాల గురించి అవగాహన కల్పించడం ద్వారా నాణ్యత అనేది అధిక ధరకు మాత్రమే పర్యాయపదంగా ఉంటుంది అనే భావనను తొలగించడానికి.
సి. PMBJP కేంద్రాన్ని ప్రారంభించడంలో వ్యక్తిగత వ్యవస్థాపకులను భాగం చేయాడం ద్వారా ఉపాధిని సృష్టించడం.
డి. పైవన్నీ
- View Answer
- Answer: డి
3. ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన సమృద్ధ్కు IIT ఢిల్లీతో పాటు మద్దతు ఇచ్చిన సంస్థ?
ఎ. బ్రిక్స్
బి. ప్రపంచ బ్యాంకు
సి. WHO
డి. USAID
- View Answer
- Answer: డి
4. తెలంగాణలో పరీక్షించిన భారతదేశపు ఆటోమేటిక్ రైలు ఢీకొనే రక్షణ వ్యవస్థ పేరు?
ఎ. సురక్ష
బి. ధాల్
సి. కవచ్
డి. రక్ష
- View Answer
- Answer: సి
5. తన బడ్జెట్ 2022-23లో "ఒంటె రక్షణ, అభివృద్ధి విధానాన్ని" ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం?
ఎ. మహారాష్ట్ర
బి. కేరళ
సి. రాజస్థాన్
డి. గుజరాత్
- View Answer
- Answer: సి
6. ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ పారిశుద్ధ్య సర్వే ఏడవ ఎడిషన్‌ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ?
ఎ. మహిళా మంత్రిత్వ శాఖ
బి. విద్యా మంత్రిత్వ శాఖ
సి. గిరిజనుల మంత్రిత్వ శాఖ
డి. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: డి
7. రాజస్థాన్‌లోని పాకిస్థాన్ సరిహద్దు వెంబడి పెంచిన సరిహద్దు భద్రతా దళం నిఘా పేరు?
ఎ. సర్ద్ హవా
బి. గుడ్ సమారిటన్
సి. రండోరి బెహక్
డి. దేవి శక్తి
- View Answer
- Answer: ఎ
8. ఏ రాష్ట్రంలో అతిపెద్ద తెగలలో కోన్యాక్లు ఉన్నారు?
ఎ. ఛత్తీస్‌గఢ్
బి. నాగాలాండ్
సి. త్రిపుర
డి. జార్ఖండ్
- View Answer
- Answer: బి
9. భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన ఫ్లయింగ్ ట్రైనర్ సీ లెవల్ ట్రయల్స్‌ను పుదుచ్చేరిలో విజయవంతంగా పూర్తి చేసిన ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్?
ఎ. హంస-NG
బి. హాక్-NG
సి. హారిస్-NG
డి. హెర్క్యులస్-NG
- View Answer
- Answer: ఎ
10. OCEANS 2022 కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పోజిషన్ ఏ నగరంలో జరిగింది?
ఎ. కోల్‌కతా
బి. చెన్నై
సి. కొచ్చి
డి. ముంబై
- View Answer
- Answer: బి
11. 2022లో ఇండియా గ్లోబల్ ఫోరమ్ (IGF) ఈవెంట్ వేదిక?
ఎ. బెంగళూరు
బి. వారణాసి
సి. చెన్నై
డి. గాంధీ నగర్
- View Answer
- Answer: ఎ
12. సమర్థ్( SAMARTH) పేరుతో మహిళల కోసం ప్రత్యేక ఎంట్రప్రెన్యూర్షిప్ ప్రమోషన్ డ్రైవ్‌ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ?
ఎ. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
బి. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
సి. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ
డి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: డి
13. ఏ రాష్ట్రంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి అమిత్ షా శంకుస్థాపన చేశారు?
ఎ. మహారాష్ట్ర
బి. ఉత్తర ప్రదేశ్
సి. త్రిపుర
డి. తమిళనాడు
- View Answer
- Answer: సి
14. PM-SYM పథకం కింద డొనేషన్-ఇ-పెన్షన్ ప్రచారాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ?
ఎ. సైన్స్ మంత్రిత్వ శాఖ
బి. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ
సి. గిరిజనుల మంత్రిత్వ శాఖ
డి. విద్యా మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: బి
15. ఏ నగరంలో పాన్-ఇండియా ప్రోగ్రాం 'ఝరోఖా' ప్రారంభ వేడుక జరిగింది?
ఎ. భోపాల్
బి. లఖ్ నవూ
సి. నోయిడా
డి. గురుగ్రామ్
- View Answer
- Answer: ఎ
16. WHO -గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్కడ ఏర్పాటు కానుంది?
ఎ. గురుగ్రామ్
బి. ముంబై
సి. జామ్‌నగర్
డి. ఢిల్లీ
- View Answer
- Answer: సి
17. పేపర్ బ్యాలెట్ పేపర్లను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లతో భర్తీ చేసే ప్రతిపాదనను ఆమోదించిన రాష్ట్రం?
ఎ. మహారాష్ట్ర
బి. గుజరాత్
సి. కేరళ
డి. అసోం
- View Answer
- Answer: డి
18. మిషన్ ఇంద్రధనుష్‌లో దేశంలోని ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
ఎ. మహారాష్ట్ర
బి. హిమాచల్ ప్రదేశ్
సి. ఢిల్లీ
డి. ఒడిశా
- View Answer
- Answer: డి