Chess: చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్న ఆటగాడు?
భారత్ వేదికగా జరిగే ప్రతిష్టాత్మక 44వ చెస్ ఒలింపియాడ్–2022లో పాల్గొనే భారత జట్లను మే 2న అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) ప్రకటించింది. ఆతిథ్య జట్టుగా వేర్వేరు విభాగాల్లో రెండేసి చొప్పున జట్లను ఆడించే వెసులుబాటు ఉండటంతో ఓపెన్, మహిళల విభాగాల్లో కలిపి 20 మందితో మొత్తం నాలుగు జట్లను ఎంపిక చేశారు. రష్యాలో యుద్ధం కారణంగా భారత్‌కు టోర్నీ వేదిక మారగా... చెన్నైలో జూలై 28 నుంచి ఆగస్టు 10 వరకు ఒలింపియాడ్‌ను నిర్వహిస్తారు.
GK Persons Quiz: విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ కొత్త CEO గా ఎవరు నియమితులయ్యారు?
మెంటార్‌గా విశ్వనాథన్..
రెండు వారాల పాటు జరిగే చెస్ ఒలింపియాడ్‌లో భారత్ తరఫున ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తెలంగాణకు చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసి బరిలోకి దిగనున్నారు. చెస్ దిగ్గజం, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఈసారి భారత జట్టుకు ‘మెంటార్’ హోదాలో మార్గనిర్దేశనం చేయనున్నాడు.
భారత జట్ల వివరాలు
ఓపెన్:
భారత్ ‘ఎ’: పెంటేల హరికృష్ణ, శశికిరణ్, విదిత్, అర్జున్, ఎస్‌ఎల్ నారాయణన్.
భారత్ ‘బి’: నిహాల్ సరీన్, దొమ్మరాజు గుకేశ్, ఆధిబన్, ప్రజ్ఞానంద, రౌనక్ సాధ్వాని.
మహిళలు:
భారత్ ‘ఎ’: హంపి, హారిక, తానియా, వైశాలి, భక్తి కులకర్ణి.
భారత్ ‘బి’: పద్మిని రౌత్, సౌమ్య స్వామినాథన్, మేరీ ఆన్ గోమ్స్, వంతిక, దివ్య దేశ్‌ముఖ్.
2014 ఒలింపియాడ్‌లో భారత జట్టు కాంస్యం గెలవగా... కరోనా కారణంగా ఆన్‌లైన్‌లో జరిగిన 2022 ఏడాది టోర్నీలో రష్యాతో భారత్ సంయుక్త విజేతగా నిలిచింది. 2021 ఏడాది టోర్నీలో మహిళల విభాగంలో భారత జట్టుకు కాంస్యం లభించింది.
World Championship: వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణం నెగ్గిన తొలి భారత ప్లేయర్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 44వ చెస్ ఒలింపియాడ్–2022లో చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టుకు మెంటార్‌గా వ్యవహరించనున్న ఆటగాడు?
ఎప్పుడు : మే 02
ఎవరు : విశ్వనాథన్ ఆనంద్
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) నిర్ణయం మేరకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్