World Championship: వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణం నెగ్గిన తొలి భారత ప్లేయర్?
గ్రీస్‌లోని హెరాక్లియోన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్–2022లో మహారాష్ట్రలోని పుణేకి చెందిన హర్షద శరద్ గరుడ్ మహిళల 45 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. తద్వారా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో పసిడి పతకం సాధించిన తొలి భారతీయ వెయిట్‌లిఫ్టర్‌గా 18 ఏళ్ల హర్షద గుర్తింపు పొందింది. ఈ ఈవెంట్‌లో స్నాచ్‌లో 70 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 83 కేజీలు బరువెత్తిన హర్షద ఓవరాల్‌గా 153 కేజీలతో టాప్ ర్యాంక్‌లో నిలిచి.. స్వర్ణం కైవసం చేసుకుంది. కాన్సు బెక్టాస్ (టర్కీ–150 కేజీలు) రజతం... హిన్కు లుమినిత (మాల్డోవా–149 కేజీలు) కాంస్యం నెగ్గారు. గతంలో భారత్ తరఫున ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో మీరాబాయి (2013 లో), జిలీ దలబెహెరా (2018లో) కాంస్యాలు... అచింత (2021లో) రజతం సాధించారు. హర్షద 2020 ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో స్వర్ణం, ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గింది.
GK Important Dates Quiz: ప్రపంచ కిడ్నీ దినోత్సవం 2022 ఏ రోజున జరుపుకుంటారు?Khelo India University Games 2022: ఖేలో ఇండియా గేమ్స్‌ను ఎక్కడ నిర్వహిస్తున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్–2022లో స్వర్ణం నెగ్గిన తొలి భారత ప్లేయర్?
ఎప్పుడు : మే 02
ఎవరు : హర్షద శరద్ గరుడ్
ఎక్కడ : హెరాక్లియోన్, గ్రీస్
ఎందుకు : స్నాచ్‌లో 70 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 83 కేజీలు బరువెత్తిన హర్షద ఓవరాల్‌గా 153 కేజీలతో టాప్ ర్యాంక్‌లో నిలిచినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్