Khelo India University Games 2022: ఖేలో ఇండియా గేమ్స్‌ను ఎక్కడ నిర్వహిస్తున్నారు?
కర్ణాటక రాష్ట్ర రాజధాని నగరం బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్–2022లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల టెన్నిస్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. మే 1న జరిగిన ఫైనల్లో భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సారథ్యంలోని ఓయూ జట్టు 2–0తో రాజస్తాన్ యూనివర్సిటీ జట్టును ఓడించింది. శ్రీవల్లి రష్మిక, సామ సాత్విక, అవిష్క గుప్తా, పావని పాథక్‌లు కూడా ఓయూ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఏప్రిల్ 24న ప్రారంభమైన ఈ క్రీడలు మే 3వ తేదీన ముగియనున్నాయి.
భారత షూటింగ్ రైఫిల్ చీఫ్ కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు?
పదేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్‌లో ప్లేయర్‌గా బరిలోకి దిగి... త్రుటిలో కాంస్య పతకం కోల్పోయిన భారత షూటర్ జాయ్‌దీప్ కర్మాకర్ ఇప్పుడు జాతీయ కోచ్‌గా అవతారం ఎత్తనున్నాడు. మూడేళ్ల కాలానికి 42 ఏళ్ల జాయ్‌దీప్‌ను భారత షూటింగ్ రైఫిల్ జట్టు చీఫ్ కోచ్‌గా నియమించారు. 2024 పారిస్ ఒలింపిక్స్ సన్నాహాలను ఇప్పటి నుంచే ప్రారంభిస్తామని జాయ్‌దీప్ తెలిపాడు.Badminton: ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన భారతీయురాలు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్–2022లో స్వర్ణ పతకం సాధించిన జట్టు
ఎప్పుడు : మే 1
ఎవరు : ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల టెన్నిస్ జట్టు
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : ఫైనల్లో భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సారథ్యంలోని ఓయూ జట్టు 2–0తో రాజస్తాన్ యూనివర్సిటీ జట్టును ఓడించడంతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్