Men's Hockey: హాకీ ప్రపంచకప్–2023కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం?
ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచకప్–2023కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్, రూర్కేలా నగరాల్లో జనవరి 13 నుంచి 29వ తేదీ వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 16 జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. ఈ టోర్నీ లోగోను ఏప్రిల్ 14న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆవిష్కరించారు. ఒడిశా రాజధాని నగరం భువనేశ్వర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. హాకీ ఇండియా, దాని అధికారిక భాగస్వామి ఒడిషా రాష్ట్రం ఈ ప్రపంచకప్‌నకు వరుసగా రెండోసారి ఆతిథ్యమిస్తున్నాయి. 2018 ప్రపంచకప్ కూడా భారత్‌లోనే జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్‌ఐహెచ్) అధ్యక్షుడిగా నరిందర్ బత్రా ఉన్నారు.
Chess: రెక్యావిక్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచిన భారతీయుడు?
ఆసీస్ హెడ్ కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను నియమించారు. జస్టిన్ లాంగర్ తర్వాత 2022, ఫిబ్రవరిలో మెక్ డొనాల్డ్‌కు తాత్కాలికంగా కోచింగ్ బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆయన్నే నాలుగేళ్ల పాటు పూర్తిస్థాయి కోచ్‌గా నియమించారు. గతంలో బిగ్‌బాష్ లీగ్ జట్లకు కోచ్‌గా వ్యవహరించిన మెక్‌డొనాల్డ్ 2019లో ఆస్ట్రేలియా కోచింగ్ బృందంలో చేరారు. ఆస్ట్రేలియా తరఫున 2009లో నాలుగు టెస్టులు ఆడి మొత్తం 107 పరుగులు చేసి 9 వికెట్లు తీశాడు.
Formula One: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన ఫెరారీ డ్రైవర్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచకప్–2023 లోగో ఆవిష్కరణ
ఎప్పుడు : ఏప్రిల్ 14
ఎవరు : ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్
ఎక్కడ : భువనేశ్వర్, ఒడిశా
ఎందుకు : ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచకప్–2023ను ఒడిశా రాష్ట్రంలో నిర్వహించనున్న నేపథ్యంలో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్