Skip to main content

Formula One: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన ఫెరారీ డ్రైవర్‌?

Charles Leclerc

ఫార్ములావన్‌ తాజా సీజన్‌లో ఫెరారీ జట్టు డ్రైవర్‌ చార్లెస్‌ లెక్‌లెర్క్‌ రెండో టైటిల్‌ సాధించాడు. మెల్‌బోర్న్‌ వేదికగా ఏప్రిల్ 10న జరిగిన సీజన్‌ మూడో రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో లెక్‌లెర్క్‌ (మొనాకో) విజేతగా నిలిచాడు. 58 ల్యాప్‌ల రేసును ‘పోల్‌ పొజిషన్‌’ తో ప్రారంభించిన లెక్‌లెర్క్‌ గంటా 27 నిమిషాల 46.548 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. పెరెజ్‌ (రెడ్‌బుల్‌) రెండో స్థానంలో, రసెల్‌ (మెర్సిడెస్‌) మూడో స్థానంలో నిలిచారు.

Tennis: సాలినాస్‌ ఓపెన్‌ టోర్నీలో విజేతగా నిలిచిన జంట?

రన్నరప్‌ తెలంగాణ 
జాతీయ సీనియర్‌ బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఏప్రిల్ 10న జరిగిన ఫైనల్లో తెలంగాణ 82–131 పాయింట్ల తేడాతో ఇండియన్‌ రైల్వేస్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. పురుషుల ఫైనల్లో తమిళనాడు 87–69తో పంజాబ్‌ జట్టును ఓడించి విజేతగా నిలిచింది.

Commonwealth Games : 2026 కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యమివ్వనున్న దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన ఫెరారీ డ్రైవర్‌?
ఎప్పుడు :  ఏప్రిల్  10
ఎవరు    : ఫెరారీ జట్టు డ్రైవర్‌ చార్లెస్‌ లెక్‌లెర్క్‌ (మొనాకో) 
ఎక్కడ    : మెల్‌బోర్న్‌, ఆస్ట్రేలియా
ఎందుకు : 58 ల్యాప్‌ల రేసును లెక్‌లెర్క్‌ గంటా 27 నిమిషాల 46.548 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచినందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 13 Apr 2022 06:49PM

Photo Stories