Skip to main content

Commonwealth Games : 2026 కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యమివ్వనున్న దేశం?

Commonwealth Games

2026 కామన్వెల్త్‌ క్రీడల ఆతిథ్య వేదికల్ని, క్రీడాంశాల్ని కామన్వెల్త్‌ గేమ్స్‌ (సీడబ్ల్యూజీ) ఆర్గనైజింగ్‌ కమిటీ ఏప్రిల్ 12న ప్రకటించింది. 2026 కామన్వెల్త్‌ క్రీడలకు ఆస్ట్రేలియా దేశం ఆతిథ్యమివ్వనుందని వెల్లడించింది. ఇప్పటి వరకు ఒక్క నగరానికే పరిమితమైన క్రీడలు ఇకపై బహుళ వేదికల్లో జరుగనున్నాయి. 2026 మార్చిలో విక్టోరియా(ఆస్ట్రేలియా) రాష్ట్రంలోని మెల్‌బోర్న్, గిలాంగ్, బెండిగో, బల్లరట్, గిప్స్‌లాండ్‌ నగరాల్లో పోటీలు నిర్వహిస్తారు. 

Cricket: మహిళల వన్డే వరల్డ్‌కప్‌–2022లో విజేతగా నిలిచిన జట్టు?

టి20 క్రికెట్‌ సహా 16 క్రీడాంశాల జాబితాను కామన్వెల్త్‌గేమ్స్‌ సమాఖ్య (సీజీఎఫ్‌) విడుదల చేసింది. ఇందులో షూటింగ్, ఆర్చరీ, రెజ్లింగ్‌ ఈవెంట్లు లేవు. సీజీఎఫ్‌ నియమావళి ప్రకారం ఆతిథ్య దేశం తమ విచక్షణాధికారం మేరకు క్రీడాంశాలను పక్కనబెట్టొచ్చు. ఆస్ట్రేలియా చాలాసార్లు కామన్వెల్త్‌కు ఆతిథ్యమిచ్చింది. తొలిసారి సిడ్నీ (1938) అనంతరం పెర్త్‌ (1962), బ్రిస్బేన్‌ (1982), గోల్ట్‌కోస్ట్‌ (2018)లలో మెగా ఈవెంట్స్‌ జరిగాయి. బెండిగో వేదికపై 2004లో యూత్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ పోటీలు కూడా జరిగాయి.

Tennis Player: ఆటకు వీడ్కోలు పలికిన బెల్జియం క్రీడాకారిణి?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2026 కామన్వెల్త్‌ క్రీడలను ఎక్కడ నిర్వహించనున్నారు?
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు    : కామన్వెల్త్‌ గేమ్స్‌ (సీడబ్ల్యూజీ) ఆర్గనైజింగ్‌ కమిటీ
ఎక్కడ    : మెల్‌బోర్న్, గిలాంగ్, బెండిగో, బల్లరట్, గిప్స్‌లాండ్‌ నగరాలు, విక్టోరియా రాష్ట్రం, ఆస్ట్రేలియా

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 13 Apr 2022 12:33PM

Photo Stories