Tennis Player: ఆటకు వీడ్కోలు పలికిన బెల్జియం క్రీడాకారిణి?
గతంలో రెండుసార్లు రిటైర్మెంట్ (2007, 2012) ప్రకటించి ఆ తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన బెల్జియం మహిళా టెన్నిస్ స్టార్ కిమ్ క్లియ్‌స్టర్స్ ఈసారి మాత్రం శాశ్వతంగా ఆట నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ఏప్రిల్ 13న తెలిపింది. 2021 ఏడాది ఇండియన్ వెల్స్ ఓపెన్‌లో చివరిసారి బరిలోకి దిగిన 38 ఏళ్ల క్లియ్‌స్టర్స్ తన కెరీర్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌ను (2005, 2009, 2010–యూఎస్ ఓపెన్; 2011–ఆస్ట్రేలియన్ ఓపెన్) నెగ్గింది. తన కుటుంబంతో అమెరికాలో స్థిరపడిన క్లియ్‌స్టర్స్ 2003లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. కెరీర్ మొత్తంలో 41 టైటిల్స్ నెగ్గిన క్లియ్‌స్టర్స్ 523 మ్యాచ్‌ల్లో గెలిచి, 131 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మొత్తం 2 కోట్ల 45 లక్షల 45 వేల 194 డాలర్ల (రూ. 186 కోట్లు) ప్రైజ్‌మనీని సంపాదించింది.
Orleans Masters 2022: మిథున్ మంజునాథ్ ఏ క్రీడకు చెందినవాడు?
సానియా మీర్జా ఏ క్రీడలో ప్రసిద్ధురాలు?
చార్ల్స్‌టన్ ఓపెన్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నీ-2022లో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జోడీ రన్నరప్‌గా నిలిచింది. అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో ఉన్న చార్ల్స్‌టన్ నగరం వేదికగా ఏప్రిల్ 10న జరిగిన ఫైనల్లో సానియా–హర్డెస్కా జంట 2–6, 6–4, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో నాలుగో సీడ్ మాగ్దా లినెట్ (పోలాండ్)–ఆంద్రియా క్లెపాచ్ (స్లొవేనియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. ఫైనల్లో ఓడిన సానియా–హర్డెస్కా జోడీకి 25,900 డాలర్ల (రూ. 19 లక్షల 66 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 305 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
100m Hurdles: ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను ఎక్కడ నిర్వహిస్తున్నారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్