Orleans Masters 2022: మిథున్ మంజునాథ్ ఏ క్రీడకు చెందినవాడు?
ఓర్లియాన్స్ మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్–2022లో భారత ఆటగాడు మిథున్ మంజునాథ్ రన్నరప్‌గా నిలిచాడు. ఏప్రిల్ 3న ఫ్రాన్స్‌లోని ఓర్లియాన్స్ నగరం వేదికగా జరిగిన ఫైనల్లో మంజునాథ్ 11–21, 19–21 తేడాతో నాలుగో సీడ్ తొమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు.
100m Hurdles: ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను ఎక్కడ నిర్వహిస్తున్నారు?
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రాస్‌టేలర్ ఏ దేశానికి చెందినవాడు?
న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న రాస్ టేలర్‌కు ఏప్రిల్ 4న ఆ దేశ జట్టు విజయంతో వీడ్కోలు పలికింది. టేలర్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయిన మూడో వన్డేలో కివీస్ 115 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. ఫలితంగా సిరీస్‌ను 3–0తో క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్‌లోని హామిల్టన్ నగరంలో ఈ సిరస్‌ను నిర్వహించారు.
రాస్ టేలర్ వన్డే రికార్డు: 236 వన్డేల్లో 47.55 సగటుతో టేలర్ 8607 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు, 51 అర్ధ సెంచరీలు ఉండగా...అత్యుత్తమ స్కోరు 181 నాటౌట్.
Cricket: మహిళల వన్డే వరల్డ్‌కప్–2022లో విజేతగా నిలిచిన జట్టు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఓర్లియాన్స్ మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్–2022లో రన్నరప్‌గా నిలిచిన భారత ఆటగాడు?
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : మిథున్ మంజునాథ్
ఎక్కడ : ఓర్లియాన్స్, ఫ్రాన్స్
ఎందుకు : ఫైనల్లో మంజునాథ్ 11–21, 19–21 తేడాతో నాలుగో సీడ్ తొమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్