100m Hurdles: ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను ఎక్కడ నిర్వహిస్తున్నారు?
కేరళలోని కోజికోడ్ వేదికగా ఏప్రిల్ 2న ప్రారంభమైన 25వ జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2022లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి యర్రాజి జ్యోతి పసిడితో మెరిసింది. ఏప్రిల్ 4న నిర్వహించిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని అందుకుంది. 13.08 సెకన్ల టైమింగ్‌తో ఆమె రేస్‌ను పూర్తి చేసింది. మరోవైపు మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో తెలంగాణ అథ్లెట్ జి. మహేశ్వరి కాంస్యం గెలుచుకుంది. 10 నిమిషాల 47.30 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసిన మహేశ్వరి మూడో స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 6వ తేదీ వరకు ఈ చాంపియన్‌షిప్‌ను నిర్వహించనున్నారు.
Cricket: మహిళల వన్డే వరల్డ్‌కప్–2022లో విజేతగా నిలిచిన జట్టు?
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎక్కడ ఉంది?
జాతీయ జూనియర్ బాలుర హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌ను ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏప్రిల్ 4న జరిగిన ఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్ 35–30 తేడాతో రాజస్తాన్‌పై విజయం సాధించింది.
Miami Open 2022: మయామి ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచిన క్రీడాకారిణి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2022 జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణం గెలిచిన క్రీడాకారిణి?
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి యర్రాజి జ్యోతి
ఎక్కడ : కోజికోడ్, కేరళ
ఎందుకు : రేసును అందరికంటే ముందుగా 13.08 సెకన్ల టైమింగ్‌తో ముగించినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్