Skip to main content

Challenger Tennis Tourney: చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో సంచలన విజయం సాధించిన నిశేష్‌!

లిటిల్‌ రాక్‌ ఓపెన్‌ ఏటీపీ–75 చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో తెలుగు సంతతికి చెందిన అమెరికా యువతార నిశేష్‌ బసవ రెడ్డి సంచలన విజయం సాధించాడు.
Nishesh sensational victory over the Seventh Seal   ATP 75 Challenger Tournamen

అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో 19 ఏళ్ల నిశేష్‌ 7–5, 6–4తో ఏడో సీడ్, ప్రపంచ 252వ ర్యాంకర్‌ ఈథన్‌ క్విన్‌ (అమెరికా)పై నెగ్గాడు. 

93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిశేష్‌ ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన నిశేష్‌ తల్లిదండ్రులు 1999లో అమెరికాకు వచ్చి అక్కడే స్థిరపడ్డారు. 

Thailand Open 2024: థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత‌గా సాత్విక్‌-చిరాగ్ జోడీ

Published date : 29 May 2024 01:12PM

Photo Stories